Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/553

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

526

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

విజయనగరాధీశ్వరుఁడగు ప్రౌఢదేవరాయనికి లోపడిన యీ తెలుఁగు రాయఁ డాతని దం డయాత్రలో సింహాద్రిదాఁక వెళ్లినట్లు శ్రీ చిలుకూరి వీరభద్రరావు పంతులుగారు తలంచుచున్నారు. అది సంగతముగా నున్నది. శ్రీనాథుఁడీ తెలుంగురాయని నా సందర్పముననేని, తర్వాతనేని సందర్శించి యుండవచ్చును' [శృంగార శ్రీనాథము-పుటలు 153 – 155]

తెలుఁగురాయనివలన సంభావనమును బడసి శ్రీనాధుఁ డక్కడనుండి వెడలి మహావిద్వాంసుడయి సర్వజ్ఞసింహనామము వహించి రాచకొండసంస్థానము నకు ప్రభువుగా నుండిన సర్వజ్ఞసింగమనీని సందర్శించి సత్కారము బొందుటకయి తదాస్థానమునకుఁ బోయెను. శ్రీనాధుడు రాజదర్శనము చేయుటకు ముందక్కడఁ గూడఁ దనకు విజయము కలిగింపవలెనని తనయిష్ట దేవత యయిన సరస్వతి నీ క్రింది పద్యముతో వేఁడుకొనెనని చెప్పుదురు.

           సీ. దీనారటంకాలఁ దీర్థ మాడించితి
                           దక్షిణాధీశు ముత్యాలశాల
               పలుకుతోడై తాంధ్రభాషామహాకావ్య
                           నైషధగ్రంథసందర్భమునకుఁ
               బగులఁగొట్టించి తుద్భటవివాదప్రౌఢి
                           గౌడడిండిమభట్టుకంచుఢక్క
               చంద్రశేఖరుక్రియాశక్తిరాయలయొద్దఁ
                           బాదుకొల్పితి సార్వభౌమ బిరుద

               మెటులు మెప్పించెదో నన్ను నింకమీఁద
               రావుసింగమహీపాలు ధీవిశాలు
               నిండుకొలువున నెలకొనియుండి నీవు
               సరససద్గుణనికురుంబ! శారదాంబ!

ప్రౌఢదేవరాయాంధ్రవల్లభాదుల మహాసంస్థానములకుఁ బోయి వారలచే మెప్పొందిన కవిసార్వభౌముఁడీ సింగమనాయని చిన్న సంస్థానమునకుఁ