పుట:Aandhrakavula-charitramu.pdf/549

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

522

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

స్వర్ణస్నానసత్కారము జరిగినది గర్ణాటమహారాజసంస్థానమునందే యని శ్రీనాధకృతమైన, కాశీఖండములోవి యీ కృతిపతి సంబోధనపద్యము విస్పష్టపఱుచుచున్నది.

       శా. కర్ణాటక్షితినాధమౌక్తికసభాగారాంతసంకల్పిత
           స్వర్ణ స్నానజగత్ప్రసిద్ధకవిరాట్సంస్తుత్యచారిత్ర ! దు
           గ్ధార్ణోరాశిగభీర! ప్రాహ్నముఖమధ్యాహ్నాపరాహ్ణార్చితా
           పర్ణావల్లభ! రాజశేఖరమణీ ! పంటాన్వయగ్రామణీ !

అంతట శ్రీనాథుఁడు రాయలకొలువు వీడ్కొని బహుధనకనకసంచయముతో మరల యశోధనార్జనముకొఱకు దేశసంచారమునకు బైలుదేఱెను. ఈ సంచారములలో నితఁ డాంధ్రవల్లభుని మైలోరు రెడ్డినాయకుని; సర్వజ్ఞసింగమ నాయనిని సందర్శించి సత్కారముఁ బడసెనని చెప్పుదురు. ఆంధ్రవల్లభుఁడు దక్షిణమున కాంచీనగరాధీశ్వరుఁడుగానుండిన సంపరాయని (శంభురాయని) కుమారుఁడైన తెలుగురాయఁడు. వీరబుక్కరాయల (1355-77) కుమారుఁడైన కంపరాయలు తండ్రి యాజ్ఞనుసారముగా మథురాసురత్రాణుని జయించుటకయి దక్షిణదిగ్విజయయాత్ర వెడలినప్పుడు త్రోవలో కాంచీపురము రాజధానిగా రాజ్యమేలుచుండిన సంపరాయని తన సేనాపతి యైన సాళువమంగుని సాహాయ్యముచేత జయించి కాంచీపుర మును దన ముఖ్యపట్టణముగాఁ జేసికొనెను. మధురావిజయమునందీ క్రింది శ్లోకములలో

        శ్లో. “అంతర్పింబితచంపేంద్రా కంపేద్ర స్యాసీపుత్రికా
             అప్సరోభ్యః పతిం దాతు మంతర్వత్నీ కిలాభవత్.
             ఆథ వంచితత్ఖడ్గ ప్రహారః కంపభూపతిః
             ఆకరో దసినా చంప మమరేంద్రపురాతిథిమ్.”

గంగాదేవి తన భర్త పౌరుషమును వర్ణించెడి యుత్సాహాముతో కంపరాజు చంపరాయని (సంపరాయని) తన ఖడ్గధారతో ఖండించి చంపెనవి గొప్ప