520
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
మ. అని యా డిండమసార్వభౌమకవి ప్రఖ్యాతంబుగాఁ దత్పురా
తనవృత్తాంతము నెల్ల దెల్పినఁ జమత్కారంబు వీక్షించి యా
జననాథాగ్రణియున్ సభాసదులు నుత్సాహంబునం బొంది కాం
చభూషాదు లొసంగి రెంతయు దయాసంరంభధౌరేయులై .
పయిపద్యమునందుఁ బేర్కొనబడిన జననాధాగ్రణి వీరనరసింహరాయలు. ఇట్లు 1490-వ సంవత్సర ప్రాంతములయం దుడినడిండిమకవి సార్వభౌముఁడు శ్రీనాధునిచే జయింపఁబడినవాఁడు కాఁజాలఁడు. శ్రీనాధుఁడు ద్వితీయడిండిమకవిసార్వభౌముని నుద్దండవివాద ప్రౌఢిచే నోడించి యతని కంచుఢక్కను పగులగొట్టించి యాతని కవిసార్వభౌమ బిరుదమును స్వవశము చేసికొన్నట్లు చెప్పఁబడినను, తరువాత నాతనిసంతతివారు సహితము వంశాగతమైన విజయడిండిమమును ధరించుచు కవిసార్వభౌమ బిరుదమును వహించుచునే యుండిరి. ఈ మువ్వురు డిండిమకవిసార్వభౌములలోను ప్రథముఁడు 1380 సంవత్సర ప్రాంతమునందును, ద్వితీయుఁడు 1420 సంవత్సర ప్రాంతమునందును, తృతీయుఁడు 1480 సంవత్సర ప్రాంతము నందును, ఉండినవారగుటచేత మస శ్రీనాధకవి జయించినవాఁడు ద్వితీయ డిండిమకవి సార్వభౌముఁడే కాని తక్కిన యిద్దఱును కారని సిద్దాంతమగు చున్నది. ఈ డిండిమభట్టుయొక్క కవిసార్వభౌమ బిరుదమును స్వాధీనము చేసికొన్నాను. గొంత కాలమువఱకు దాని నుపయోగించుట కే హేతువు చేతనో శ్రీనాధుఁడు సందేహించుచుండెను.
[శ్రీనాధుఁడు వాదమున నోడించింది రెండవడిండిమభట్టునేయనియు, డిండిమభట్టబిరుదము వంశపారంపర్యముగావచ్చుచున్నదేయనియు నందఱు నంగీకరించుచున్నారు. కాని యీ డిండిమభట్టు మొదటి దేవరాయలకాలమున నుండెనని కొందఱును, రెండవ దేవరాయలకాలమున నుండెనని కొందఱును దలఁచుచున్నారు. డాక్టరు నేలటూరి వేంకటరమణయ్యగా రీతఁడు మొదటి