517
శ్రీనాథుఁడు
యుండవలెను. 1426 -వ సంవత్సరప్రాంతమున నని తోఁచుచున్నది. ప్రౌఢదేవరాయలు దేవరాయనామధేయము గల కర్ణాటకరాజులలో రెండవ వాఁడు. మొదటివాఁడు ప్రౌఢదేవరాయని తండ్రి యైన దేవరాయ మహారాజు. అతఁడు 1406 వ సంవత్సరము మొదలుకొని 1422-వ సంవత్సరమువఱకును కర్ణాటరాజ్య మేలెను. ఈతని కాలమునందు సహితము శ్రీనాధకవి యుండెనుగాని యతఁ డీయనరాజ్య కాలములో కొండవీటి నగరమును విడిచి దేశ సంచారము చేయ నారంభించలేదు. అంతేకాక గౌడడిండిమ భట్టుసహిత మీయన రాజ్యావసానదశయందు నుండక యీతని కొడుకై న ప్రౌఢదేవరాయని యేలుబడిలోనే తధాస్థానకవియయి యుండిన వాఁడు. ఈ గౌడడిండిమభట్టుయొక్క కవిసార్వభౌమ బిరుదమును లాగుకొని శ్రీనాధుని కిప్పించుటలో సహాయుఁడయినవాఁడు సాళువగుండనరసింహరాయని మంత్రిగా నుండిన చంద్ర శేఖరుఁడు కానేరఁడు. ప్రౌఢదేవరాయని యాస్థానములో మఱియొక చంద్రశేఖరుఁడుండి యుండవచ్చును. చంద్రశేఖర క్రియాశక్తియన్న చోట చంద్రభూషక్రియాశక్తి యని పాఠాంతరము గలదు. ఈ చంద్రభూషక్రియాశక్తిపాఠమే సరియైనదైనపక్షమున, 1340-వ సంవత్సరమునందు శ్రీ వీర బుక్కరాయలరాజ్యకాలములో వ్రాయబడిన కొండూరు శాసనములో
శ్లో. శ్రీచంద్రభూషణాచార్యపదపంకజయో స్తథా,
గ్రామం కొండూరునామానం బుక్కక్ష్మాపతి రార్పయత్.
అని రాజగురు వైన చంద్రభూషాచార్యుని పేరు కనబడుచున్నది గాని ప్రౌఢదేవరాయనికాలములో చంద్రభూషుని పేరెక్కడను వినబడదు. ఈ చంద్రభూషుడు “యతీంద్రస్య క్రియాశక్తిగురోః ప్రీతయే శ్రీ చంద్రభూషణాచార్యః" అని పై శాసనములోనే యుండుటనుబట్టి క్రియాశక్తి యతీంద్రునిశిష్యు డగుట స్పష్టము. క్రియాశ క్తిపీఠ మా కాలమునందు శంకరాచార్యపీఠము వంటి శైవమతపీఠమై కర్ణాటక రాజులకు గురుపీఠమయి యుండెను ఆ పీఠాధికారి విరూపాక్షాదిశంకరమఠముల కువలెనే యతీంద్రుఁ