పుట:Aandhrakavula-charitramu.pdf/543

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

516

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

నూఱేండ్లు జీవించెనని చెప్పఁబడెడు వేదాంతదేశికులవారితో సమకాలీనుఁడు వైష్ణవమతప్రచారకుఁడైన వేదాంతదేశికులకును, శైవమత ప్రచారకుఁడైన డిండిమభట్టునకును మతవిషయమున ననేకవాదములు జరిగినట్టును వారు వాదప్రతివాదసందర్బమున నొండొరుల నాక్షేపించుచు వచ్చినట్టును, తెలిపెడు కథలును, శ్లోకములును దక్షిణదేశమునందు వ్యాపించియున్నవి.1360-70 సంవత్సర ప్రాంతములయందుండిన యీ ప్రథమ డిండిమ భట్టును,1360-వ సంవత్సరమునకు దరువాతగాని పుట్టని శ్రీనాథుడు వాదములో నోడించె ననుట పొసఁగనేరదు. ఇక శ్రీనాథునితో వాదించి యషజయము నొందిన డిడిమభట్టు రెండవడిండిమభట్టో, మూడవడిండిమభట్టో యయి యుండవలెను.

రెండవ డిండిమభట్టు పేరరుణగిరినాధుఁడు. ఇతఁడు సంస్కృతమున యోగా నందప్రహసనమును రచించెను. ఆ ప్రహసనమునందతఁడు తన్నుఁగూర్చి "శ్రీ డిండిమకవిసార్వభౌమ ఇతి ప్రధికబిరుదాంకనామధేయః, సరస్వతీ ప్రసాదలబ్ధ కవితాసనాథః, శ్రీమానరుణగిరినాధః తేన కృతేన యోగానంద నామ్నా ప్రహసనేన సభానియోగ మనుతిష్ఠామి” అని వ్రాసికొని యున్నాడు. డిండిమకవిసార్వభౌమబిరుదాంకుఁడును, సరస్వతీ ప్రసాదలబ్ద కవితాసనాధుఁడును నైన యరుణగిరినాధుఁడు తన యోగానందప్రహసములో భరతవాక్యముగా “ దీర్ఘాయుర్దేవరాయోదధతు వసుమతీచక్రమాచంద్రతారమ్" అని దేవరాయని నాశీర్వదించి యున్నాఁడు. ఈ కవి వర్ణించిన దేవరాయఁడు విజయనగరాధీశ్వరుఁడైన ప్రౌఢదేవరాయలని యితరదృష్టాంతములవల్లఁ దేలుచున్నది. ఈ ప్రౌఢదేవరాయలు 1423 వ సంవత్సరము మొదలుకొని 1443-వ సంవత్సరమువఱకును కర్ణాటకరాజ్యపరిపాలనము చేసెను. ఈతని కాలములో శ్రీనాధుఁడుండె ననుటకు సందేహము లేదు. శ్రీనాథుఁడుద్భటవివాదప్రౌఢిచేత నోడించి కంచుఢక్క పగులఁ గొట్టించినది తప్పక యరుణగిరినాథనామము గల యీ రెండవ డిండిమభట్టునే. ఇతఁడు ప్రౌఢదేవరాయని రాజ్యకాలములో నుండినవాఁ డగుటచేత నీతనిని శ్రీనాధుఁ డోడించుట 1423-వ సంవత్సరమునకుఁ దరువాత నయి