పుట:Aandhrakavula-charitramu.pdf/545

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

518

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

డుగా నుండెను. అయిసను వీరబుక్కరాయలనాటి చంద్రభూషాచార్యుఁడు గాని, క్రియాశక్తియతీంద్రుఁడుగాని ప్రౌఢదేవరాయలకాలములో నున్న శ్రీనాధునికవిసార్వభౌమ బిరుదముతో సంబంధించి యుండుట పొసఁగ నేరదు. క్రియాశక్తి మఠశిష్యుఁడయి శాసనములోని చంద్రభూషాచార్యునికి మనుమఁడై న మఱియొక చంద్రభూషాచార్యుఁడు రాజగురువయి ప్రౌఢదేవరాయనికాలములో నుండిన నుండవచ్చును. మధురావిజయకృతికర్త్రి యు, బుక్కరాయని కోడలును, కంపరాయనిరాణియునైన గంగాంబ తన మధురవిజయమను వీరకంపరాయ చరిత్రలో క్రియాశక్తి నిట్లు స్తుతించెను.

         శ్లో. అసాధారణసాదృశ్యం విలసత్సర్వమంగళమ్
            క్రియాశక్తిగురుం వందే త్రిలోచనమి వాపరమ్.

 1377 మొదలు 1404-వ సంవత్సరమువఱకును రాజ్యము చేసిన ద్వితీయ హరిహరరాయనిపుత్రుఁ డిమ్మడి బుక్కరాయని మైసూరుదాన శాసనములో కులగురు వయిన కాశీవిలాస క్రియాశక్తి పేర్కొనఁబడెను.

        శ్లో. శ్రీమత్కాశీవిలాసాఖ్య క్రియాశక్తీశ సేవినా
            శ్రీమత్త్య్రంబక పాదాబ్జ సేవానిష్టాతచేతసా.

మన చరితాంశమునకు చంద్రభూషుని కథ గాని చంద్ర శేఖరునికథగాని యంతగా ప్రథాన మయినది కాదు. మన శ్రీనాధునిచే నోడగొట్టఁబడి కవి సార్వభౌమ బిరుదమును గోలుపోయిన వాఁడు రెండవ డిండిమకవిసార్వభౌముఁడయిన యరుణగిరినాధుఁ డగుట నిశ్చయము విజయడిండిమమును, కవి సార్వభౌమ బిరుదాంకమును స్వయముగా సంపాదించుకొన్నవి గాక మాతామహునివలన సంక్రమించినవే యయినను, అరుణగిరినాధుఁ డసామాన్య పాండిత్యమును నిరుపమానకవితా సామర్థ్యమును గలవాఁ డయినందునకు సంశయము లేదు. ఇతఁడు యోగానంద ప్రహసనాది కావ్యములను రచియించి ప్రసిద్ధి కెక్కినట్టీవఱకే చెప్పబడెను