505
శ్రీనాథుఁడు
5. వేమాధిపో మాచవిభుశ్చ నందనౌ
శ్రీకోమటీంద్రన్య గుణై కసంశ్రయౌ ?
భూలోక మేకోదరజన్మవాంఛయా
భూ౽యోవతీర్ణావివ రామలక్ష్మణౌౌ.
6. స వేమభూప స్సకలాసు విద్యా స్వతి ప్రగల్ఫో జగసబ్పగండ8,
కచిదాస్థానగతః కవీనాం కావ్యామృతాస్వాదనతత్పరో౽భూత్.
7. అమరుకకవినా రచితాం శృంగారరసాత్మికాం శతశ్లోకీమ్,
శ్రుత్వా వికసితచేతా స్తదభిప్రాయం ప్రకాశతాం నేతుమ్.
8. మూలశ్లోకాన్ సమాహృత్య ప్రక్షిపాన్పరిహృత్య చ,
విధత్తే విదుషామిష్టాం టీకాం శృంగారదీపికామ్
9. అవతారో౽థ సంబంధో౽భి ప్రాయో భావలక్షణమ్,
నాయికా తదవస్థా శ్చ నాయక శ్చ తధా రసః
10. అంగాని కైశికీ వృత్తే రలంకార స్తతః క్రమాత్,
ఇత్యేతాని ప్రవక్ష్యంతే యధాసంభవ మంజసా.
పుస్తకాంతమునందీ గద్యమున్నది.
"ఇతి శ్రీవీరనారాయణ సకలవిద్యావిశారద పెద్దకోమటివేమభూపాల విరచితా శృంగారదీపికాఖ్యా అమరుకవ్యాఖ్యా సమాప్తా."
ఈ శృంగారదీపికయందలి 4, 5 పద్యములు శ్రీనాధుని శాసనములలోనివి. ఈ పుస్తకము శ్రీనాధకృత మనుట కీ రెండు శ్లోకములే యాధారములు. 1400-వ సంవత్సరము మొదలుకొని 1420-వ సంవత్సరము వఱకును మహాకవి యైన శ్రీనాధుఁ డొక్క గ్రంధమునై నను జేయక యూరకుండఁ జాలఁడు. ఇట్లు వృధపుచ్చఁబడిన దనుకొన్న కాలమిరువది సంవత్సరములే యననేల ? ఇరువదినాలుగు సంవత్సరములు కావచ్చును. శ్రీనాథుడు విధ్యాధికారిగా నున్న కాలము పెదకోమటివేమన రాజ్యకాలము మాత్రమే