పుట:Aandhrakavula-charitramu.pdf/531

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

నమే మొట్టమొదటిది. దీనినిబట్టి శ్రీనాధుఁడు 1408-వ సంవత్సరమునకుఁ బూర్వమునందే విద్యాధికారిగా నియమింపబడినట్టు స్పష్టపడుచున్నది.

ఈ నాలుగు శాసనములను దప్ప శ్రీనాధుఁడు "పెదకోమటి వేమారెడ్డి కొండవీటిరాజ్యపరిపాలనము చేసిన యిరువది సంవత్సరములలోను వేఱు గ్రంథ మేదియుఁ జేసినట్టు కానఁబడదు. చేసినచో శృంగారదీపికనుగూడ చేసియుండవచ్చును. అమరుకవ్యాఖ్య యైన శృంగారదీపికలోని మొదటి యెనిమిది శ్లోకములు నిట్లున్నవి.

1. శ్లో. విశంకటకటస్థలీగళదమందదానస్పృహా
       భ్రమద్భ్రమరకాకలీకలితనిత్యకర్ణోత్సవమ్.
       ప్రణమ్రజనమస్తక ప్రకటడిండిమాడంబరం
       ముఖే గజ ముపాస్మహే వపుషి మానుషం దైవతమ్.

2. అన్యోన్యమేళనవశాత్ ప్రధమం ప్రవృద్దం
       మధ్యే మనా గ్వ్యవహితం చ కుతో౽పి హేతోః
       ప్రాప్తం దశా మధ మనోరధలాభయోగ్యాం
       పాయాచ్ఛిరం రతిమనోభవయో స్సుఖం వః

3. రాజ్యం వేమ స్స చిర మకరోత్ ప్రాజ్య హేమాద్రిదానో
       భూమీదేవై ర్భువమురుభుజో భుక్తశేషా మభుంక్త,
       శ్రీశైలాగ్రాత్ ప్రభవతి పథి ప్రాప్తపాతాళగంగా
       సోపానాని ప్రమథపదవీ మారురుక్ష శ్చకార.

4. మాచక్షోణిపతి ర్మహేంద్రవిభవో వేమక్షితీశాగ్రజో
       హేమాద్రే స్సదృశో బభూవ సుగుణైస్తస్య త్రయో నందనాః
       కీర్త్యా జాగ్రతి రెడ్డిపోతనృపతి శ్రీ కోమటీంద్ర స్తతో
       నాగక్ష్మాపతి దిత్యుపాత్తవపుషో ధర్మార్ధకామా ఇవ.