పుట:Aandhrakavula-charitramu.pdf/530

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

503

శ్రీనాథుఁడు

         కణభుగ్గ్రంధితగ్రంధసింథుమంథానభూభ్య
          అక్షపాదమతప్రేక్షపక్షిణీకృతచేతసే 18

          తస్మై కాశ్యపగోత్రాయ సింగనార్యాయ ధీమతే,
          శాంతాయ శివ భక్తాయ యజ రామ్నాయ వేదినే. 19

          ప్రాదా త్త్రిలిం విషయే వెల్నాడో ర్దివిసీమని,
          కృష్ణవేణ్యా స్తరంగిణ్యాః ప్రతీరే పర్యవస్థితం. 20

          పొన్నుపల్ల్యాహ్వయం గ్రామం నిధానం సర్వసంపదాం,
          సాష్టైశ్వర్యం సాష్టభోగం ధారాపూర్వం ధరాధిపః. 21

          అస్య గ్రామస్య చిహ్నాని దేశభాషయా లిఖ్యంతే

          ***** ***** *****

         శ్రీనాథ భట్ట శాసనాచార్య దక్షిణ భాగం వకటి.

                          **********

      శ్లో. విద్యాధికారీ శ్రీనాధో వీరశ్రీవేమభూపతేః
          అకరో దాకరో వాచాం నిర్మలం ధర్మశాసనం.

ఈ శాసనము శాకాబ్దములు 1330 సర్వధారి సంవత్సరాశ్వయుజ మాసము నందు సంభవించిన సూర్యోపరాగసమయమున ననఁగా క్రీస్తు శకము 1408-వ సంవత్సరములో వైద్యశిఖామణియు, మహావిద్వాంసుఁడు నైన సింగరార్యునకు వెల్నాటిసీమలో కృష్ణాతీరమునం దుండిన పొన్నుపల్లి గ్రామమును దాన మిచ్చిన సందర్భమున వ్రాయcబడినది. "శ్రీనాథ భట్ట శాసనాచార్య దక్షిణ-భాగం వకటి" అని శాసనాంతమునం దుండినందున శ్రీనాధున కీగ్రామములో నికొకభాగ మియ్యఁబడినట్టు కనుపట్టుచున్నది. పూర్వోదాహృతములై యీ నాలుగు శాసనములలో నీ పొన్నుపల్లి శాస