506
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
కాక యాతని కుమారుఁడైన రాచవేమనరాజ్యకాలముకూడ నయి యున్నది. 1400-వ సంవత్సరము మొదలుకొని 1420-వ సంవత్సరమువఱకును పెదకోమటివేమనయు, 1420 నుండి నాలుగు సంవత్సరములు రాచవేమనయు భూమిపాలనము చేసిరని కొందఱును, రాచవేమని నాలుగు సంవత్సరములును 1424-వఱకును గాక తండ్రి రాజ్యకాలమని చెప్పఁబడెడి దానిలోఁ గడపటి నాలుగు సంవత్సరములే యయి 1420-వ సంవత్సరము వఱకు మాత్రమేయనియు 1420-వ సంవత్సర ప్రాంతమునందే కొండవీటిరెడ్డిరాజ్యము కర్ణాటప్రభువుల పాలయ్యెనని కొందఱును శాసనసంశోధకులు చెప్పుచున్నారు. ఎట్లయినను వింశతిదీర్ఘసంవత్సరములు నిరర్గళకవితా ధార గల కవిచేతి లేఖినియు సనల్పకల్పనసమర్ధమైన బుద్దియు స్వసామర్థ్యమును మఱచి యస్వాభావికనిద్రను వహించుట సంభావ్యము కాదు. అందుచేత శీనాథుఁ డీ కాలములో నేదో మహాగ్రంథమును రచించుచుండియుండవలెను. ఆ మహా గ్రంథము శివరాత్రిమాహాత్మ్య మని తోఁచుచున్నది. * [1]శ్రీనాధుఁడు దీనిని తన ప్రభువై న పెదకోమటివేమవిభున కంకితము చేయ వలెనని యుద్దేశించి యుండును. కాని యింతలోపల కొండవీటిరాజ్య మన్యా క్రాంత మగుటయు, దనాకాశ్రయులైన వేమనృపాలసింగనామాత్యాదులు పరలోకగతులగుటయుఁ దటస్థిం
చినందున శ్రీనాథ మహాకవి రాజధాని యైన కొండవీటియందు నిలువ నాధారము లేక తన గ్రంథపరికరములతో నా వీడు విడిచి దేశాంతరగమనమనోన్ముఖుఁడయి 1420-వ సంవత్సర ప్రాంతముల
- ↑ [శివరాత్రిమహాత్మ్యము శ్రీనాథుని కడపటి రచసయైయుండునని శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రులుగారు, 'ఆంధ్రతరంగిణి' కర్తయుఁ దలంచుచున్నారు. శ్రీనాథ మహాకవి పెద కోమ టి వేమారెడ్డి యాస్థానమున విద్యాధికారిగానున్న కాలములో గ్రంథరచనము సాగించి యుండక పోవచ్చుననియు, గ్రంథములను రచింపవలెనను నియమము లేదనియు శ్రీనాధుఁడు తన కావశ్యకమని తోఁచినపుడే గ్రంథరచనకుఁ గడంగుచుండెననియు, జీవనము నిర్విచారముగ సాగిపోవుచుండుటచే గ్రంథరచనం గూర్చిన యాలోచనయే యతనికి లేకుం డెనని యూహింప వచ్చుననియుఁ గొందఱి యాశయము. పెదకోమటి వేమారెడ్డికి సంస్కృతము పై నెక్కువ వ్యామోహముండుటయు నిందులకు హేతువైనఁ గావచ్చునని కొందఱి యూహ.]