Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/517

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

490

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

[హరవిలాస రచన కుమారగిరిరెడ్డి కాలమునందే జరిగియుండునవి కొందఱి తలంపు; కాని చాలమంది విద్వద్విమర్శకులు దాని నంగీకరించలేదు. కొండవీటి రాజ్యము పతనమైన పిదప శ్రీనాథుఁడు దేశములఁ దిరుగుచు, కంచికిఁ బోయి యుండెననియు, అప్పడచటనున్న తన బాలసఖుని (తిప్పయనెట్టి) కోరిక పయిని హరవిలాసమును రచించి, యతని కంకిత మిచ్చి, సమ్మానముపొందెననియు, కాఁగా హరవిలాసము శృంగార నైషధ, భీమఖండములు రచింపఁబడిన పిదప - కాశీఖండరచసమునకుఁ బూర్వము రచింపఁబడి యుండు ననియు శ్రీ ప్రభాకరశాస్త్రులుగారు వివరించిరి. హరవిలాసరచనమునాఁటికి అవచి తిప్పయసెట్టి బాలసఖుఁడగు శ్రీనాథుఁడు వృద్ధుఁడే యనియు, శ్రీనాధునికంటెను గూడఁ దిప్పయనెట్టి మఱీవృద్ధుఁ డనియు శ్రీశాస్త్రిగారు హరవిలాస పీఠికలోఁ దెల్పియున్నారు. [చూ. ఆనందముద్రణాలయము వారి హరవిలాసము - పీఠిక-4] ఏతద్రచనా కాలమునాఁటికి శ్రీనాధునికి నలువది, నలువదియైదు సంవత్సరముల ప్రాయమును, తిప్పయకేఁబది యేcబదియైదు సంవత్సరముల వయసును నుండియుండునని "ఆంధ్రకవి తరంగణి" యందుఁ గలదు. [చూ. సంపుటము.5 పుట. 53]

భాగవతముదశమస్కంధము శ్రీకృష్ణునిలీలలను దెలుపునట్లుగానే యీహర విలాసము హరుని విలాసములను దెలుపుచున్నది. ఇందలి శివవిలాసములలో మొదటిది చిఱుతొండనంబి చరితమును గూర్చినది. శైవాచారపరాయణుఁడైన చిఱుతొండనంబి కృతిపతి యైన తిప్పయనెట్టివంశమునకు మూలపురుషుఁడైనట్లీ గ్రంథమునఁ జెప్పఁబడినది. వీరశైవశిఖామణి మైన చిఱుతొండనంబి యను వైశ్యరత్నము నిత్యమును దనపంక్తిని జంగమ ప్రమధులు లేక భుజించెడువాఁడు కాఁడఁట! ఒకసారి ఇరువది రెండుదినము లేక వృష్టి గురిసి తనవాస స్థానమైన కాంచీనగరమునందు సహ పంక్తిని గుడుచుటకు జంగమ మాహేశ్వరుఁ డొక్కఁడును దొరకకపోఁగా వ్రతభంగము కలుగకుండుట కయు చిఱుతొండనంబి యూరంతయు వెదకుచుఁ బోయి పోయి తుద కూరిబైట నున్న యొక పాడు దేవాలయ