పుట:Aandhrakavula-charitramu.pdf/518

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీనాథుఁడు

ములో భార్యయైన గ్రుడ్డిముసలియవ్వతో నుండిన వృద్ధుడై కుష్ఠు వ్యాధి పీడితశరీరుఁడై న జంగమమాహేశ్వరుఁ డొక్కcడు కానcబడెనట! "చిఱు తొండనంబి యాతనిని దనతోడి సహజభోజనమునకుఁ బిలువఁగా నతడు కొత్తగా నుపనీతుఁడయి పదియేండ్ల యీడుగల కుమారునిఁ దల్లియే, చంపి వండి వడ్డించెడు గృహస్థునిపంక్తిని గానీ భుజింప రాననెనఁట. దుష్కరమగు నా కోరికను జెల్లించుటకు చిఱుతొండనంబియు నాతని దేవి యైన తిరువేంగనాచియు నొప్పుకొని యా ముసలిజంగమును సకళత్రముగా స్వగృహమునకుఁ గొనిపోయి యావఱకే తాను జంగమమాహేశ్వరున కాహార మగుటకు సంతోషపూర్వకముగా నంగీకరించి యుండిన సిరియాలుని పాఠశాలనుండి కొని వచ్చి యుపనీతునిఁజేసి తల్లియైన తిరువెంగనాంచి యే యా బాలుని తఱిగి వండి మగనిపంక్తిని గూరుచుండిన యా ముసలి జంగమునకు వడ్డించెనcట. అప్పుడా జంగము చిఱుతొండనంబియెుక్కకొడు కొకఁడుకూడఁ గూరుచుండక యపుత్రకుని పంక్తిని భుజింపనొల్ల ననెనట ! దానికి [1] చిఱుతొండనంబి తనకు సిరియాలుఁ డేకపుత్రుc డగుటచేత వేఱొక పుత్రుఁడు లేఁడని విన్నవింపగాఁ వానినే తల్లి చేతఁ బిలిపింపు మని యా వృద్దమాహేశ్వరుఁ డా జ్ఞాపించెనఁట ! తదాజ్ఞానుసార ముగాఁ దల్లి యైన తిరువెంగనాంచి "సిరియాలా" యని కేకవేయఁగా నందఱు నాశ్చర్యసంతోషమగ్నమానసు లగునట్లుగా మృతినొందిన సిరియాలుఁడే కసుగందని శరీరముతో బ్రతికి వచ్చెనఁట ! ఆ ముసలిజంగమును ముసలియవ్వయు నా వీరశైవ దంపతీపుత్రులయెుక్క- భక్తిని నిశ్చల శైవాచారానుర క్తిని పరీక్షించుటకయి కైలాసముననుండి కపటవేషముతో భూమి కవతరించి వచ్చిన పార్వతీపరమేశ్వరులఁట ! పార్వతీపరమేశ్వరు లా కుటుంబము యొక్క శైవాచారపరాయణత్వమునకు మెచ్చి కడపట వారికి ముగ్గురకు మాత్రమే కాక కాంచీపురములో నుండిన వారియాప్తబంధువులైన వైశ్యుల కందఱికిని గూడ కైలాసనివాసప్రాప్తి ననుగ్రహించిరcట !

  1. [తనకు బుత్రుఁడున్నాcడనియు, వాఁడెక్కడికొ పోయెననియు వంటకములు చల్లారకము న్నే భుజింపవలెననియు, చిఱుతొండనంబి కోరినట్లు హరవిలాసములోఁ గలదు.]