Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/516

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

489

శ్రీనాథుఁడు

             జగదగోపాలరాయ వేశ్యాభుజంగ
             పల్లవాదిత్యభూదానపరశురామ
             కొమరగిరిరాజ దేవేంద్రుకూర్మిహితుఁడు
             జాణజగజెట్టి దేవయచామిసెట్టి.

          గీ. తమ్ము లిద్దఱుఁ దనయాజ్ఞ తల ధరించి
             యన్ని దీవులఁ దెచ్చులాభార్థకోటి
             యర్థులకు నిచ్చి కీ ర్తి బేహారమాడు
             నవచిత్రిపురాంతకుండు వంశాబ్దివిధుఁడు

         మ. తరుణా[1]చీనితవాయిగోవరమణాస్థానంబులం జందనా
             గరుకర్పూరహిమాంబుకుంకుమరజ8కస్తూరికాద్రవ్యముల్
             శరధిం [2] గప్పిలిజోగులన్ విరివిగా సామాన్లఁ దెప్పించు నే
             నేర్పరియో వైశ్యకులోత్తముం డవచితిప్పండల్పడేయిమ్మహిన్.
                                                        [పీఠిక 26-28]

ఇటువంటి యోడలవ్యాపారియైన తిప్పయసెట్టి కిద్దఱు తమ్ములును, ముగ్గురు కొడుకులు నుండినట్లీ పద్యమునఁ జెప్పఁబడినది.

         ఉ. ధీచతురు ల్సహోదరులు తిర్మల సెట్టియుఁ జామి సెట్టియున్
             మాచన విశ్వనాథ చినమల్ల కుమారులు వీర లాత్మజుల్
             శ్రీచెలువంబు గైకొనినచేడియ యన్నమదేవి భార్యగా
             గోచరమే నుతింప సయకోవిదునిఁద్రిపురాంతకాధిపున్
                                                           [పీఠిక-31]

 

  1. [సీరి అని పాఠాంతరము]
  2. [గప్పలి జోగుపల్లి వలికాసమ్మాన్లం దెప్పించు నేర్పరియై అని పాఠాంతరము]