పుట:Aandhrakavula-charitramu.pdf/510

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

483

శ్రీనాథుఁడు

ఇత్యాదిస్థలములలో భాషాంతర మెంతో మనోహరముగా నున్నది, గుణ విశేషము కలిగియున్నదగుటచేతనే యాంధ్రనైషధ మాంధ్ర పంచకావ్య ములలో నొక్కటిగాఁ బరిగణింపఁబడుటయే కాక వానిలో నగ్రగణ్యముగా భావింపఁబడుచున్నది. ఈ నైషధకావ్యరచన వలన శ్రీనాధున కాంధ్రకవు లలో నత్యంత ప్రసిద్ధి కలిగినది. ఎంతటి ప్రసిద్ధి కలిగినను శ్రీనాధున కింతవఱకు రాజాస్థానములలోఁ ప్రవేశము కలిగినదికాదు. ధనార్జ నమున కయి పెదకోమటివేమనృపాలుని సంస్థానమునకుఁ బోయి యతని మంత్రులు మొద లై నవారి నాశ్రయించినట్టే శ్రీనాధుఁడు స్వస్థలమును విడిచి వచ్చి యారంభ దశలోనే రెడ్డిరాజ్యమునకుఁ బ్రధాననగరమయిన కొండవీటికిఁ బోయి కుమారగిరి రెడ్డి యొక్క మంత్రులు మొదలయినవారి నాశ్రయించియుండును గాని యచ్చటివా రీతని కచ్చటఁ బ్రవేశము కలుగనీయలేదు. [1] ఉభయులును శైవమతస్థు లగుటచేతనో, మఱియే హేతువుచేతనో యట్టి ప్రయాణములయందు శ్రీనాధునకు కుమారగిరిభూపాలుని సుగంధభాండాగారాధ్యక్షుడయి కోటీశ్వరుడుగా నుండిన యవచి తిప్పయనెట్టితోడి మైత్రి కలిగినది. అందుచేతనే శ్రీనాధుఁడు తిప్పయసెట్టికి బాలసఖుఁ డయ్యెను. అప్పటికి శ్రీనాధుఁ డిరువది యిరుపదియైదు సంవత్సరముల బాలుఁడే యయినను తిప్పయ్య నెట్టి యాతనికంటె మిక్కిలి పెద్దవాఁడయి యుండును. కొండ వీటియందు తప్ప శ్రీనాధున కవచి తిప్పయ సెట్టితోడిమైత్రి కల కవకాశము వేఱొకచోటఁ గానఁబడదు, శ్రీనాధుఁడు నైషధరచనానంతరమునఁ దన బాలసఖుఁ డయిన తిప్పయనెట్టిని జూచి సమ్మానమును బొందుటకు మరలఁ గొండవీటికిఁ బోయెను. అప్పడు శ్రీనాధుఁడు ధనస్వీకారము చేసి హరవిలాసమును రచించి తిప్పయనెట్టి కంకిత మొనర్చెను.

హరవిలాస మేడాశ్వముల గ్రంథము. నైషధకావ్యరచనా నంతరమున నెల్ల వారును దానిని సంస్కృతపదభూయిష్ఠముగాను, దీర్ఘసంస్కృతసమాస బహుళముగాను నుండిన దని నిందింపఁగా నా నిందను బాపుకొనుటకయి

  1. [కుమారగిరి కాలమున శ్రీనాథుఁ డిర్వదియేండ్ల లోపు వయస్సువాఁడయి యుండుట వలననే యాస్థానమునఁ బ్రవేశము కలగలేదని కొందఱి యభిప్రాయము.]