Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/511

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

శ్రీనాధుఁడు హరవిలాసము నాంధ్రపదభూయిష్టముగాను, విశేషదీర్ఘ సంస్కృత సమాసవిరహితముగాను జేసెను. శ్రీనాధుని గ్రంథము లన్నిటిలో నిది కడపటి దని కొందఱు వ్రాసిరి గాని యది సరి గాదు. ఇది తప్పక కొమరగిరిరెడ్డికాలములోనే రచియింపఁ బడినది. దీనికృతిపతి యైన కోమటి యవచి తిఫ్పయ్య నెట్టి కొమరగిరి భూపాలునికాలములో నుండి యాతనికి సుగంథద్రవ్యంబులు తెప్పించి యిచ్చువాఁడనియు, తిప్పయ్య నెట్టి కవి నుద్దేశించి తనకు శై_వప్రబంథ మొకటి యంకితము చేయమని యడిగె ననియు, హరవిలాసములోని యీ కింది గద్య పద్యములు స్పష్టముగా జెప్పుచున్నవి. "గద్యము . . కొమరగిరి వసంతనృపాలునివలన నాందోళికాఛత్ర చామరతురంగాది రాజ్యచిహ్నములు వడసి యమ్మహారాజునకుఁ బ్రతిసంవత్సరోత్సవంబునకుం దగిన కస్తూరీ కుంకుమ ఘనసార సంకుమ దహీమాంబుకాలాగురుగంధసారప్రభృతిసుగంధ ద్రవ్యంబు లొడగూర్చియుఁ జీనిసింహళత వాయిహురుమంజిజలలోగి ప్రభృతినానాద్వీపనగరాకరంబు లగు ధనకనకవస్తు వాహనమాణిక్యగాణిక్యంబులు తెప్పించియు, గవినైగమికవాదివాంశికవైతాళికాదు లగు నర్ధిజనంబులగునర్థంబులు గుప్పించియు ధీరుండును నుదారుండును గంభీరుండును, సదాచారుండును నన విఖ్యాతిఁ గాంచిన యవచిదేవయతిప్ప ప్రభుండొక్కనాడా స్థానమండపంబున సుఖోపవిష్టండయి

         సీ. కమలనాభునిపౌత్రు గవితామహీ రాజ్య
                           భద్రాసనారూఢుఁ పరమపుణ్యుఁ
             బాత్రు నాపస్తంబసూత్రు భారద్వాజ
                           గోత్రుసజ్జన మిత్రుఁ గులపవిత్రు
             భీమాంబికామారనామాత్యనందను
                           నఖిలపురాణు విద్యా ప్రవీణు
             నధ్వర్యు వేదశాఖాతిధినిష్ణాతు
                           నంధ్రభాషానైషధాబ్జభవుని