పుట:Aandhrakavula-charitramu.pdf/489

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

462

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

పారితోషిక మొసఁగఁ బోయెనట! కవి వానిని స్వీకరింపక 'నేను నాలుగువే లియ్యఁగా మీరు మూఁడువేలే యిచ్చెదరా ? ' యనెనఁట! నాలుగువే లనఁగా తాను సమర్పించిన శ్లోకములో నున్న నాలుగు "వే యను నక్షరములని కవియభిప్రాయము. అప్పడు రాజు నాలుగు వేలే యిచ్చెద ననెనఁట ! దానిపైని కవి 'నే నిచ్చినవే నా కిచ్చెదరా ?" యనెనఁట : 'ఆ ట్లయిన నయిదు వేలిచ్చెద" నని రాజు పలికెనఁట : "నే నాఱు వేలవాఁడను; నన్ను తక్కువపఱిిచెదరా?" యని కవి వచించెనcట. తక్కువపఱవక 'యాఱు వేలే యిచ్చెద°నని రాజనెనట ! అందుకు కవి *నేను పుట్టువుచేతనే యాఱువేలవాఁడనే ! యిందధిక మేమున్న" దని యడిగెనఁట ! అధికము కావలసిన చో రా "జేడు వేల నిచ్చెద" ననెనcట! కవి "యది రోదనసంఖ్య;మంచిది కాదనెనట. రాజా కవి వాక్చాతుర్యమునకు మెచ్చి యెనిమిదివేలిచ్చి సంతోషపెట్టి యాతనిని బంపివేసెనఁట ! ఇది వట్టికల్పనకధయే యైనను, ఆ వేమనృపాలుఁడు కవిత్వాభిమానము గలవాఁడనియు మహాదాత యునియు బోధించుచున్నది.

అనవేముఁడు 1362 మొదలుకొని 1383 వ సంవత్సరమువఱకును ప్రజానురంజకుఁ డయి పరిపాలనము చేసి పరమపదము నొందినతరువాత నీతనియన్న యైన యనపోతారెడ్డి కుమారుఁడు కుమారగిరి రాజ్యమునకు వచ్చెను.

4. కుమారగిరిరెడ్డి

ఇతఁడు 1383-వ సంవత్సరమునకుఁ దరువాత పినతండ్రి యనంతరమున సింహాసనమునకు వచ్చెను. ఈతనికాలములోనే శ్రీనాధకవి బైలుదేఱి రాజాస్థానకవి కాకపోయినను రాజమంత్రులకును తదితరాధికారపదస్థులకును కృతులియ్య నారంభించెను. కుమారగిరి పెదతాత మనుమడైన వేమారెడ్డియెుక్క ప్రధమమంత్రి నామనామాత్యుఁడు మృతినొందినతరువాత నాతని యన్న కుమారుఁడు మామిడిసింగవ్న కోమటివేమనకు మంత్రి యయ్యెను. ఈ