481
శ్రీనాథుఁడు
యయ్యెను. ఆనవేమభూపాలునిగూర్చి కవులు చెప్పిన పద్యములలో వేటూరి ప్రభాకరశాస్త్రిగారి చాటుపద్యమణిమంజరియం దుదాహరించినవాని నిందు క్రిందఁ బొందుపఱచుచున్నాను.
క. 'కవితాకన్యకు నలుగురు
కవి జనకుఁడు భట్టు దాది గణుతింపంగా
నవరసరసికుఁడె "పెనిమిటి
యవివేకియె తోడఁబుట్టు వనవేమనృపా!
క. కొంచెపుజగములలోపల
నంచితముగ నీదుకీర్తి యన వేమనృపా!
మించెను గరి ముకురంబునఁ
బంచాక్షరిలోన శివుఁడు బలసినభంగిన్.
గీ. పందికొమ్మెక్కి, పెనుబాముపడగ లెక్కి
మేటితామేటివీc పెక్కి మెట్ట లెక్కి
విసివి వేసారి యన మవిభునిఁ జేరి
రాణివాసంబు గతి మించె రత్నగర్బ
క. రాకున్నఁ బిలువఁడేనియు
రాకకు ముద మంది చేర రమ్మనఁడేనిన్
ఆఁకొన్న నీయcడేనియు
నాకొలు వటు కాల్పవలయు ననవేమనృపా!
శ్లో. అనవేమమహీపాల !
స్వస్త్యన్తు తవబాహవే
ఆహవే రిపుదోర్దండ
చంద్రమండలరాహవే.
ఒకానొకనియోగి బ్రాహ్మణకవి యీ శ్లోకము ననవేమ మహీపాలుని పైని జెప్పి చదువఁగా నతఁడు సంతోషించి యాతని మూఁడువేల సువర్ణములు