463
శ్రీనాథుఁడు
సింగన్న యనవేమునిమంత్రియైన పెద్దనామాత్యుని కనిష్టపుత్రుఁడు, శ్రీనాధుడు మొట్టమొదట సింగన్నయన్న యైన ప్రెగ్గడన్నకును తరువాత సింగన్న కును, అటుతరువాత కుమారగిరి కడపటిదినములలో నాతనిసుగంథభాండారాధ్యక్షుఁడై న యవచితిప్పయ్యసెట్టికిని కృతు లొసఁగెను. తిప్పయ్య సెట్టికి గృతి యిచ్చిన హరవిలాసములో నీ క్రింది పద్యమున్నది.
చ. హరిహరరాయఫేరొజిసహళీసురధాణగజాధిపాదిభూ
వరులు నిజప్రభావ మభివర్ణన సేయఁ గుమారగిర్యధీ
శ్వరుని వసంత వైభవము సర్వము నొక్కడ నిర్వహించు మా
తిరుమలనాథసెట్టికిని ధీగుణభట్టికి నెవ్వ రీఁడగున్ ?
పైని బేర్కొనఁబడిన హరిహరరాయలు ద్వితీయహరిహరరాయలు; అతఁడు 1377 మొదలుకొని 1404 వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసెను. అందుచేత నతఁడు కుమారగిరిరాజ్యకాలమున కీవల నాఱు సంవత్సరములు నావల నా లు గు సంవత్సరములు రాజ్యముచేసెను. రెండవవారి డయిన ఫెరోజిసహా 1393 మొదలు 1422-వ సంవత్సరము వఱకును భూపాలనము చేసెను. అందుచేత నితఁడు కుమారగిరిరెడ్డి యొక్క రాజ్యాంతకాలములో మూఁడు సంవత్సరములు మాత్రమే రాజ్య భారము వహించియుండెను. అందుచేత హరవిలాసము 1393-1400 సంవత్సరముల మధ్యమున రచియింపఁబడి యుండవలెను. కొమరగిరి విద్యా వంతుఁడు; బ్రజాపరిపాలనముకంటె వసంతోత్సవాది వినోదములయం దెక్కువ యాసక్తిగలవాఁడు. ఇతడు తన రాజ్యనిర్వహణ భారము నంతను తన మేనత్తకుమారుఁడును, మఱదియు విద్వాంసుడును సమర్థుఁడును మంత్రియునైన కాటయ వేమారెడ్డియందుంచి తాను నిర్విచారుఁడయి యుండెను. ఇతఁడు తన చెల్లెలైన మల్లాంబ యందత్యంత ప్రేమకలవాఁ డగుటచేత రాజమహేంద్రవరరాజ్యము నామె కరణముగా నామెభర్తయు దన కాప్తమంత్రియుఁ బ్రాణమిత్రుఁడునై న కాటయవేమారెడ్డికి 1386 - వ సంవత్సరమునం దిచ్చివేసెను. ఇతఁడు 1400 వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసి పరలోకగతుఁడు కాగా సంతానహీనుఁడైన యీతని