453
శ్రీనాథుఁడు
రము కలదఁట [1] ఈ కవి సర్వజ్ఞసింగమనాయని జూఁడబోవుటచేత నితఁడు పదునేనవ శతాబ్దారంభమున నున్నట్లు తేటఁబడుచున్నది. శీనాథుఁడును, బమ్మెర పోతరాజును సర్వజ్ఞసింగమనాయని యాస్థానకవీశ్వరు అయినట్టు వేంకటగిరి సంస్థావంశ చరిత్రమునందు వ్రాయబడి యున్నది. కాని యీ కవు లిద్దఱును సింగభూపాలుని కాలమువారే యైనను వీరిలో నెవ్వరు నా యాస్థానకవీశ్వరులు కారు. వీరొక సారియో రెండు సారులో తదాస్థానము: నకుఁ బోయి వారిపైఁ బద్యములను జెప్పి తమ కవిత్వ ప్రౌఢిమను జూపి రాజువలన బహుమానములను బొందిరి. శీనాధుఁడు రెడ్ల యాస్థానకవీశ్వరుఁడు. ఈత డించుమించుగాఁ దానుచేసిన గ్రంథముల నన్నిఁటిని రెడ్లకో వారి మంత్రులకో కృతి యిచ్చియున్నాఁడు. ఇతడు రాజమహేంద్రపురమునఁ జిరకాల ముండినను కొండవీటిసీమయందుఁ బుట్టినవాఁ డని తోఁచు చున్నది ఈతనికి రెడ్లకవీశ్వరుఁడని ప్రసిద్ధి. ఈతఁడు కొండవీటి రెడ్ల కడను, రాజమహేందవరపురెడ్లకడను గూడ కవీశ్వరుఁ డయి యుండి యున్నందున నీతని చరితము వివరముగాఁ దెలియుటకై రెడ్లచరిత్రము. నిచ్చట సంక్షేపించి చెప్పుట యనావశ్యకము కాఁజాలదు.
అనుమకొండయందు సామాన్యకర్షకుఁడైన దొంతి యల్లాడ రెడ్డి యను పంటకాపు ధర్మచింత గలివాఁ డొకఁ డుండె ననియు, ఆతని యింటి కొక నాఁటిరాత్రి కోమటి యొకఁడు వేమన యనువాఁడు రాఁగా నాతని నాదరించి కోమటియింట భోజనము పెట్టించి తనయింటఁ బరుండఁ దావిచ్చి, ఆతఁడు శయనించినప్ప డతని మూటలో స్పర్శవేది యుండుట గ్రహించి దాని నపహరించి, దానిమూలమున మహా ధనికుఁ డయ్యెననియు, చెప్పెడి కథ యొకటి గలదు. ఈ కథ యే యింకొక విధముగాఁ గూడఁ జెప్పఁబడు
- ↑ [సంస్కృతమున 'చమత్కార చంద్రిక' యాను నలంకార శాస్త్ర గ్రంథమును రచించిన వాఁడు సింగ భూపాలుని యాస్థాన విద్వాంసుడగు విశ్వేశ్వర పండితుఁడు; కాని సింగ భూపాలుcడు కాcడు. దీనికి సింగభూపాలీయమును నామాంతరము లేదు. సింగభూపాలుఁడు రచించిన 'రసార్ణవసుధాకరము' అను నాట్యాలంకార గ్రంథమునకే ఆ నామాంతరము కలవు.]