Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

452

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

శ్రీనాధుడు కవిత్రయమునకుఁ దరువాత మిక్కిలిప్రసిద్ధుఁడైన కవి. ఇతనికి ప్రౌఢ దేవరాయలు కవిసార్వభౌమ బిరుద మిచ్చినట్లు శీనాధవిరచితమైన యీ క్రింది చాటుపద్యమువలనఁ దెలియవచ్చుచున్నది.

            సీ. దీనారటంకాలఁ దీర్థ మాడించితి
                           దక్షిణాధీశు ముత్యాలశాల
               పలుకుతోడై తాంధ్రభాషామహాకావ్య
                           నైషధగ్రంథసందర్భమునకుఁ
               బగులఁగొట్టించి తుద్భటవివాదప్రౌఢి
                           గౌడడిండిమభట్టుకంచుఢక్క
               చంద్రశేఖరుక్రియాశక్తిరాయలయొద్దఁ
                           బాదుకొల్పితి సార్వభౌమ బిరుద

               మెటులు మెప్పించెదో నన్ను నింకమీఁద
               రావుసింగమహీపాలు ధీవిశాలు
               నిండుకొలువున నెలకొనియుండి నీవు
               సరససద్గుణనికురుంబ శారదాంబ.

శ్రీనాథకవి యా కాలమునం దిప్పటి వేంకటగిరిసంస్థానాదిపతులకుఁ బూర్వఁడయి గోలకొండసీమలోని మెతుకు సంస్థానమున కధీశ్వరుఁడయి యుండిన సింగమనాయని సందర్శింపఁబోయినప్ప డా రాజు తన్నేమి తప్పు పట్టునో యన్న భీతిచేతఁ దనకుఁ బరాభవము కలుగకుండఁ జేయు మని సరస్వతిని బ్రార్థించెను. పయి పద్యమునందుఁ బేర్కొనఁబడిన సింగభూపాలుఁడు మహావిద్వాంసుడు; అందుచేత నతఁడు సర్వజ్ఞ సింగమనీఁడు (నాయఁడు) అని వ్యవహరింపఁబడుచు వచ్చెను; ఇతఁడు వేంకటగిరిసంస్థానమునకు మూలపురుషుఁడయిన భేతాళనాయఁడను నామాంతరము గల చేవిరెడ్డికిఁ బదవ తరమువాఁడు. ఈ ప్రభువు సంస్కృతమున చమత్కారచంద్రికయను నలంకారశాస్త్రమును జేసెనందురు. దీనికి సింగభూపాళీయ మని నామాంత