454
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
చున్నది. వేమన యను వైశ్యుఁడొకఁడు శ్రీశైలయాత్రకుఁ బోయె ననియు, అతఁ డచ్చటి మల్లికార్జునాలయమున కుత్తరమున నున్న యరణ్యములో నితర లోహములను బంగారముగా మార్పఁగల యోషధివిశేషము లున్నట్టు కనిపెట్టి యా మందుచెట్ల యాకులపసరును రెండు కుండలనిండ నింపి వానిని గొని స్వగ్రామమునకుఁ బోవుచు మార్గమధ్యమున నొకనాటి సాయంకాల మనుమకొండఁ జేరి యా రాత్రి వసించుటకు దొంతి యల్లాడ రెడ్డియింటికిఁ బోయెననియు, ధర్మాత్ముఁ డై న యారెడ్డి యాతనివస్తుపులను తన సేద్యపు పనిము ట్టున్నపాకలోఁ బెట్టనియమించి భోజనార్ధమయి యా కోమటిని కోమటియింటికిఁ బంపెననియు, అతఁడు భోజనముచేసి మరల వచ్చులోపల రెడ్డి తన పనిముట్లను సరిచూచుకొనుటకయి యా పాకలోనికిఁ బోయి యందతని నాగిలియొక్క కఱుకోల యొకటి బంగారమువలె తళ తళలాడుచుండుట చూచి యాశ్చర్యపడి చేరువకుఁ బోయి కోమటి తెచ్చు కొన్న కుండలలోని పసరొకింత దానిపైని బడుట చూచి దాని ప్రభావము వలన నా యినపకోల సువర్ణమయి యుండునని యూహించి దానినిజమును పరీక్షించుటకై సమీపమున నున్న గడ్డపాఱ నొకదానిని గొనివచ్చి దాని నా పసరుకుండలో ముంపగా నదియు బంగార మయ్యె ననియు, అది చూచి సంతోషించి యా రెడ్డి పసరుతో నిండియున్న యా రెండు కుండలను దన యింటిలోఁ బెట్టుకొని యా పాకకు నిప్పంటించెననియు, ఇంతలోఁ గోమటి భోజనము చేసి వచ్చి యాకాశము నంటుచున్న మంటలతో బగబగ మండు చున్న యా పాకను జూచి దానిలోఁ దన పసరుకుండలు రెండును మండి పోయె నని భావించి దుఃఖించి ప్రాణమున కంటెను ధన మెక్కువగా భావించెడి యా వైశ్యశిఖామణి విత్తము పోయినతరువాతఁ దన బ్రతుకెందున కని తానును మిన్నంటి మండుచుండిన యా జ్వాలలోఁబడి ప్రాణములను విడిచెననియు, తరువాత నా కోమటి వేమయ్య పిశాచమయి యల్లాడ రెడ్డి కుటుంబమును బట్టుకొని యాతనికిఁ బుట్టిన బిడ్డల నెల్లఁ జంపుచు వచ్చెననియు, దాని కా రెడ్డి దుఃఖితుఁడయి మొక్కుకొనగా నా కోమటి స్వప్నములో నాతనికిఁ గనఁబడి తన పేరు పెట్టినయెడల ముందు పుట్టఁ