432
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
సీ. నిర్మించె నే మంత్రి నిరుపమప్రాకార
నవకంబు గా గోపీనాధపురము
గెలిచినాఁ డే మంత్రివిక్రమమునఁ
బ్రబలుఁడై యవనులబలము నెల్ల
నిలిపినాఁడే మంత్రి నియత వైభవమున
గోపికావల్లభుఁ గూర్మి వెలయ
పాలించె నే మంత్రి ప్రకటధర్మఖ్యాతి
మహిమ మీఱఁగ నాంధ్రమండలంబు
నతఁడు భూపాలమంత్రీంద్రసతతవినుత
ధీవిశారదుఁ డచ్యుతదేవరాయ
మాన్యహిత వర్తనుఁడు శౌర్యమహితయశుఁడు
భానుతేజుండు రాయనభాస్కరుండు.
అని కొండవీటిగోపీనాధస్వామివారి యాలయముఖద్వారశాఖయందు వ్రాయబడియున్న పద్యమునుబట్టి రామయభాస్కరుఁ డచ్యుత దేవరాయల కాలములో ననఁగా 1529 -వ సంవత్సరమునకుఁ దరువాత నుండుట స్పష్టము. సరిబేసై రన్న పద్యము రామయభాస్కరుని గూర్చినది గాక ద్వాత్రింశన్మంత్రుల చరితములో నున్నట్లు రాయన భాస్కరునిగూర్చిన దయిన పక్షమున
శ్లో. శాకాబే వసువహ్ని వేదధరణీగణ్యేచ ధాత్రబ్దకే
వైశాఖే వినుకొండసీమని సుధీ ర్నాదెళ్ళ యప్పప్రభుః,
వాసిష్ఠాయ చ భర్తపూడి మఖిలం గ్రామం స్వనామాంకితం
ప్రాదా ద్రాయనభాన్కరాయ విదుషేష్టైశ్వర్యభోగాన్వితమ్.
అని నాదెళ్ళ యప్పయమంత్రి శాలివాహనశకము 1439 -వ సంవత్సరము నందు అనగా క్రీస్తుశకము 1516-వ సంవత్సరము ధాతృవత్సర వైశాఖ మాసమునందు వినుకొండ సీమలోని భర్తపూడి గ్రామమును రాయని భాస్కరపండితుని కిచ్చినట్టున్న దాన శాసనమునుబట్టి యతఁడు 1516-వ సంవత్సర ప్రాంతములం దుండుట స్పష్టము. రావిపాటి తిప్పన్న యీ రెండు