433
రా వి పా టి తి ప్ప న్న
కాలములలో నే కాలమునం దుండినను,1420 వ సంవత్సర ప్రాంతములయం దుండిన వల్లభామాత్యకవి యాతనిని తన క్రీడాభిరామములో క్రింది పద్యములో నిట్ట చెప్పట పొసఁగ నేరదు.
ఉ. నన్నయభట్టతిక్కకవినాయకు లన్న హుళక్కిభాస్కరుం
డన్నను జిమ్మపూడి యమరాధిపుఁ డన్నను సత్కవీశ్వరుల్
నెన్నుదుటం గరాంజలులు [1] నిం తలుఁ జేయని రావిపాటి తి
ప్పన్నయు నంతవాఁడ తగునా యిటు దోసపుమాట లాడఁగన్.
దీనినిబట్టి యాలోచింపఁగా 1420 వ సంవత్సరమునకుఁ బూర్వమునందు రామయభాస్కరుఁడో రాయని భాస్క_రుఁడో యెవ్వడో యొకఁ డుండి యుండవలెను. ఆ కాలమునందు రామయభాస్కరుఁ డెవ్వఁడును లేఁడు గాని 1386 వ సంవత్సరము మొదలుకొని రాజమహేంద్రవర రాజ్యమును పాలించిన కాటయవేమారెడ్డికాలములో రాయని భాస్కరుఁ డొకఁడున్నట్లీక్రింది పద్యమువలనఁ దేటపడుచున్నది.
చ. కలయఁ బసిండిగంటమునఁ గాటయవేము సమక్షమందు స
త్ఫలముగ రాయనప్రభునిబాచఁడు వ్రాసిన వ్రాల మ్రోఁతలున్
గలుగలు గల్లుగల్లురనఁ గంటకమంత్రులగుండె లన్నియున్
జలుజలు జల్లుజల్లురనె సత్కవివర్యులు మేలు మే లనన్.
పయి పద్యమునం దీ రాయనభాస్క_రుఁ డప్పకవీయములో నుదాహృత మైన వద్యమునందువలెనే వ్రాయుటయందు సుప్రసిద్ధుఁ డయినట్టు చెప్పఁ బడినందున రావిపాటి తిప్పన్న చెప్పిన సరిబేసైరన్న పద్య మీ రాయన భాస్క_రునిఁ గూర్చినదే యనియు నందుచేత తిప్పన్నకవి 1380 వ సంవత్సర ప్రాంతములయందుండెననియు నింతకంటె బ్రబలప్రమాణములు దొరకు
- ↑ [నింతురు జేయని అని పాఠాంతరము.]