అనంతామాత్యుఁడు
అనంతామాత్యుఁడు పూర్వకవులలో నొకఁడు. ఈతడాఱువేల నియోగి బ్రాహ్మణుఁడు. ఈతని తండ్రి తిక్కన్న. తాత ముమ్మడన్న. ముత్తాత బయ్యన్న- ఈ బయ్యన్న మంత్రియై నట్టును, తిక్కన సోమయాజుల కాలములో నున్నట్లును ఈకవి భోజరాజీయము నందీక్రింది పద్యమునఁ జెప్పి యున్నాcడు.
చ. క్షితిఁ గ్రతు[1]కర్తనానుమతి చేకొని పంచమవేదమైన భా
రతముఁ దెనుంగుభాషాభిరామముగా రచియించినట్టి యు
న్నతచరితుండు తిక్కకవినాయకుఁ డాదట మెచ్చి భవ్యభా
రతిఁ యనఁ బేరు గన్నకవిరత్నము బయ్యనమంత్రి యల్పుఁడే.
కవిబ్రహ్మ యయిన తిక్కన సోమయాజిచేత భావ్యభారతి యని మెప్పు వడిసినంతటి మహాకవి బయ్యనచే రచియింపఁబడిన గ్రంథ మొకటి యుండిన యెడల నిప్పుడు దాని పేరయినను దెలియరాకున్నది. ఈ బయ్యన కవి యగుటయే కాక దండనాథుడు కూడ నయి యుండునని కవి యీ పద్యమునఁ జెప్పెను-
చ. శరధిసుత స్వరించు లజాతవిలోచనుమాడ్కి శీతభూ
ధరజఁ బరిగ్రహించు హిమధామకళాధరుపోల్కి సద్గుణా
భరణ పవిత్రమూర్తి కులపాలిక నాఁ దగు ప్రోలమాంబికన్
బరిణయమయ్యె నెఁయ్యమున బయ్యచమూపతి వైభవోన్నతిన్
ఈకవి తన తండ్రియైన తిక్కన కృష్ణా మండలములోని శ్రీకాకుళమునకొడయఁ డైన యంధ్ర వల్లభుని సేవ చేయుచుండినట్టు[2]ను తన తల్లి యైన