అ నం తా మా త్యుఁ డు
మల్లమాంబ యక్కదండనాధుని పుత్రి యైనట్టును నీక్రింది పద్యములలో పయి గ్రంథమునందే చెప్పియున్నాఁడు.
సీ. విలసితం బగు కృష్ణవేణి మలాపహా
రిణి భీమరథి నా ధరిత్రియందుఁ
దనరు నదీత్రయాంతర్వేది యగు పావ
నక్షేత్రమున శోభనముల కెల్ల
ధర నివాసంబగు పెరుమగూరిపురంబు
నందు విద్వజ్జనానందమైన
జీవనస్థితిచేతఁ జెన్నొంది వంశక
ర్తృత్వ సంపత్తిఁ బ్రభుత్వ మొంది
నెమ్మి బ్రత్యక్షపరమపదమ్మనంగ
నొప్పు శ్రీకాకుళంబున కొడయఁడైన
యంధ్రవల్లభహరి సేవ నలరచుండుఁ
బెక్కుభంగుల ముమ్మడి తిక్కవిభుఁడు.
సీ. శ్రీవత్సగోత్రాబ్ధి శీతాంశుఁ డగు నక్క
దండాధినాథుఁ డీ తరుణితండ్రి
లావణ్యగుణపుణ్యలక్షణాన్విత యైన
యక్కమాంబిక యీ లతాంగితల్లి
చిరకీర్తినిరతులు చిట్టనమంత్రియు
నయ్యలార్యుఁడు నాతికగ్రజన్ము
లచ్యుతాంఘ్రిసరోరుహార్చనారతుఁడు త
మ్మనమంత్రి యీ యింతి యనుఁగుదమ్ముఁ
డనఘు డగు కోటకరుణాకరార్యుఁ డను ఘ
నుండు ముదునూరి పెద్దవిభుండు నివ్వ
ధూమణికిఁ గూర్మిగల మేనమామ లనిన
మగువ లెనయె తిక్కనమంత్రి మల్లమకును.