378
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
శకము 1199 వ సంవత్సరమున (విజయవాడ) బెజవాడలోని మల్లేశ్వరస్వామికి భూమి యిచ్చినట్టు కనకదుర్గగుడి స్తంభములలో నొకదాని మీఁద వ్రాయఁబడియున్నది. ఈ కాలమునం దీయనపేరు గల శిలాశాసనము లనేకములు కానవచ్చుచున్నవి. అందు 1212 సంవత్సరములో నొకటి యనుమంచిపల్లెలోను, ఇంకొకటి నడికూడిలోను, 1213లో నొకటి బెజవాడలోను, మఱిి యొకటి గుడిమెట్టలోను, 1230 లో మూడు నవాబుపేటలోను, బహుశాసనము లున్నవి. గుడిమెట్టలోని యొకదానిలో పోతరాజు రాజేంద్రచోడుని కొడుకైనట్టున్నది. పోతరాజు త్యాగశీలుఁడని విని భీమకవి యక్కడికి పోయినప్పడు రా జాతనిగుఱ్ఱమును కట్టిపెట్టించి విడువకపోగా,
చ. హయమది సీత పోతపసుధాధిపుఁ డారయ రావణుండు ని
శ్చయముగ నేను రాఘవుఁడ ! [1]సహ్యజ వారిధి మారుఁ డంజనా
ప్రియతనయుండు [2]లచ్చన విభీషణుఁ డా గుడిమెట్ట లంక నా
జయమునుఁ బోతరక్కసునిచావును నేడవనాఁడు చూడుఁడీ
అను పద్యమును జెప్పి రాజును శిక్షించె నని పెద్దలు చెప్పెదరు. ఈ పోతరాజు పదుమూడవ శతాబ్దాదియందుండినవాఁ డగుటచేత పదునాల్గవ శతాబ్దాదియందుండిన భీమకవి యీతనికాలమునందుండి యీ పద్యమును జెప్పుట సంభవింపనేరదు. గుడిమెట్ట నేలినది, శ్రీపతిరాజు పోతరాజు గాక సాగి పోతరాజే యయినను, అప్పకవి చెప్పినట్లీ పద్యము రెల్లూరి తిరుమలయ్య చేసినదే యయి యుండవచ్చును. మఱియొక పోతరాజవిషయమయి తురగా రామకవి చెప్పిగ పద్యమును, కథయును గూడ నీ ప్రాంతముల యందు వాడుకొనుచున్నారు. తురగారామకవి యాచనార్ధము లేటవరపు పోతరాజనింటికి పోఁగా నతఁడు కవి కేమయిన నియ్యవలసివచ్చు నని యింటనుండియు భార్యచేతఁ దన భ ర్త యింట లేఁడనిపించెనట! ఆ జాడ కవి కనిపెట్టి యాతనిభార్యను జూచి కోపముతో