Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

379

వే ము ల వా డ భీ మ క వి

         క. కూటికిఁ గాకులు కూసెడు
            నేటావల మూఁక గూడియేడువఁదొడఁగెన్
            గాటికిఁగఱ్ఱలు చేరెను
            లేటవరపుపోతరాజు లేఁడా లేఁడా ?

అని రెట్టించి యడిగి తనదారిని బోయెనఁట ! భార్య యీ సంగతి మగనితోఁ జెప్పవలెనని లోపలికిఁ బోఁగా భర్త మంచముమీఁద చచ్చిపడి యుండెనట! అంతట బంధువు లందఱును దుఃఖించి దహాన సంస్కారము నిమిత్తమయి శవమును శ్మశానమునకుఁ దీసికొనిపోవుచుండఁగా వెంట నున్న యాతనిభార్య తనకెదురయిన కవికాళ్ళమీఁదఁ బడి తనకు పతిభిక్ష పెట్టమని వేడుకోగా నతఁడు
      
         క. నాఁటి రఘురాము తమ్ముఁడు
            పాటిగ? సంజీవిచేత బ్రతికినరీతిన్
            గాటికిఁ బో నీ కేటికి
            లేటవరపు పోతరాజ లెమ్మా రమ్మా !

ఆని చెప్పి యాతనిని బ్రతికించెనఁట! తురగా రామకవియు నించుమించుగా భీమకవి వంటివాఁడే.

భీమకవి పదునాల్గవ శతాబ్దాది నుండియున్నట్టు పయి నిదర్శనము లన్నిటివలనను స్పష్టమగుచున్నది. ఇప్పు డేర్పడిన యీ కవికాలమును బట్టి చూడఁగా

         గీ. భారతముఁ దెనిఁగించుచుఁ దా రచించి
            నట్టి రాఘవపాండవీయంబు నడఁచె
            ఛందము నడంప నీ ఫక్కి- సంగ్రహించె
            ననుచు భీమన యెంతయు నడఁచె దాని. [ పీఠిక - 44 ప.]

అని యప్పకవి చెప్పిన వాక్యము నిరాధార మయినట్టు స్పష్టమగుచున్నది. కవుల కాల భేదముమాట యటుండనిచ్చినను, నన్నయభట్టు భారతమును దెలిఁగింప నారంభించుటచేతఁ దా నావఱకు రచించిన రాఘవపాండవీయ మడఁగెననియు, నాంధ్రశబ్దచింతామణిని జేయుటచేతఁ దన ఛందస్సును