Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

377

వే ము ల వా డ భీ మ క వి

పూర్తిగాఁ బ్రకటింపఁబడకపోవుటచే నీకులోత్తుంగ చోళుఁడెవ్వడో, ఈతనికాల మెద్దియో తెలిసికొనుట కవకాశము లేకపోయినది. కులోత్తంగ చోళులు మువ్వురున్నారు. మొదటి యాతడు శా. శ.991-1030 మధ్యను, 'రెండవయాతడు 1054-1068 నడుమను, మూడవవాడు 1100-1188 మధ్యను రాజ్యము చేసినవారు. చొక్క నృపాలకు నకు వైరియని పై పద్యములోఁ జెప్పఁబడిన సాహిణి మారడు ప్రతాపరుద్రుని సేనాధిపతి యని చెప్పఁబడినట్టి సాహిణి మారఁడని యెంచితిమేని యాతఁడు పైని చెప్పిన మువ్వురుకు లోత్తంగ రాజుల కాలములోను లేక వారిలో మూఁడవయాతనికిఁ బిమ్మట దాదాపు ఎనుబది సంవత్సరములలో నున్నవాడు, కావున యీ పద్య మర్థము లేని దగుచున్నది. (చూ. ఆంధ్రకవి తరంగిణి, భా. 1 పుటలు, 244-245)

ఇంతేగాక నన్నయభట్టారకుని చరిత్రములో జూపినట్లు భీమకవి తన కవి జనాశ్రయఛందస్సులోఁ గావ్యాలంకారచూడామణిలోని పద్యము నుదాహరించుట భీమకవి తప్పక పదునాల్గవశతాబ్దాదియం దున్నవాఁ డన్న యీ సిద్ధాంతమును స్థాపించుచున్నది. భీమన దేశసంచారము వెడలినప్పుడు తనగుఱ్ఱము గుడిమెట్టలోని పోతరాజు పొలములోఁ బడఁగా రాజు దానిని కట్టిపెట్టించి విడువకున్నమీఁదట భీమన యాతనిని తిట్టిన పద్యమని యొకటి చదువుదురు. ఆ పద్యము రెల్లూరి తిరుమలయ్య చెప్పినట్లు కవి చెప్పుచున్నాఁడు కాని యీ ప్రాంతములయం దది భీమకవికథగా నే చిరకాలమునుండి పరంపరగా వచ్చుచున్నది. గుడిమెట్ట పాలించినది చాగి (సాగి) పోతరాజు గానీ శ్రీపతిరాజు పోతరాజు కాఁడు. ఈ పోతరాజు పెద్దాపుర సంస్థానాధిపతులగు వత్సవాయవారికి మూలపురుషుఁడు. గుడిమెట్ట యను గ్రామము కృష్ణా మండలములోని నందిగామకు నైఋతిమూలను నాలుగు క్రోశముల దూరమున నున్నది. ఇది పూర్వము చోళవంశపు రాజులలో నొక తెగవారికి రాజధానిగా నుండెను. ఆ కాలమునందు గుడిమెట్టకు రాజు గా నుండిన త్యాగిపోతరాజు బాహ్మణులకును, దేవాలయములకును బహుమాన్యము లిచ్చెను. త్యాగిపోతరాజు శాలివాహనశకము 1121 అనఁగా హూణ