Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

374

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

బ్దమున పట్టాభిషికుడైన రాజరాజునాస్థానకవియగు నన్నయభట్ట నకు రమారమి 100 సంవత్సరముల తరువాతివాడగును. భీమకవి యనంతవర్మ రాజ్యావసానదశయం దుండెననుకొన్నచో మఱి ముప్పది, నలువది సంవత్స రముల తరువాతి వాడగును. కాని శ్రీరామమూర్తిగా రనుకొన్నట్లు నన్నయభట్టుకంటె బ్రాచీనుడుకాడు. వీరేశలింగము పంతులుగా రెంచినట్లు 14 వ శతాబ్దము వాఁడగను."[1]

పయియంశములను బట్టి శ్రీరామయ్యపంతులుగారు రాయ కళింగ గంగును రాజరాజ చోడ గంగును విభిన్న వ్యక్తులని తలంచినట్లును, ఇరువురు నభిన్నులని శ్రీ వీరేశలింగము పంతులుగారు తలంచినట్లును తెలియుచున్నది. మఱియు రాజరాజ చోడగంగు రాజరాజ నరేంద్రుని దౌహిత్రుడని శ్రీ వీరేశలింగము పంతులుగారు తలంచినట్లు తెలియుచున్నది.

             సీ. వచియింతు వేములవాడ భీమన భంగి
                               నుద్దండలీల నొక్కొక్కమాటు
                 భాషింతు నన్నయభట్టుమార్గంబున
                               నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్కమాటు
                 వాక్రుత్తు తిక్కయజ్వప్రపకారము రసా
                               భ్యుచితబంధముగ నొక్కొక్కమాటు
                 పరిఢవింతు ప్రబంధపరమేశ్వరునిరేవ
                               సూక్తి వైచిత్రి నొక్కొక్కమాటు

                 నైషధాది మహాప్రబంధములు పెక్కు
                 చెప్పినాఁడవు మాకు నాశ్రితుఁడ వనఘ
                 యిపుడు చెప్పఁదొడంగిన యీప్రబంధ
                 మంకితము సేయు వీరభద్రయ్యపేర.

అను పద్యములో శ్రీనాధుఁడు చెప్పిన కవుల వరుసనుబట్టి భీమకవి నన్నయ భట్టారకునికి పూర్వుడేమో యని భ్రమ కలుగుచున్నది. కాని యీ కవి

  1. ఇట్లభిప్రాయ పడినవారు శ్రీ గురజాడ శ్రీరామమూర్తి పంతులు గారు.