375
వే ము ల వా డ భీ మ క వి
పండ్రెండవ శతాబ్దమధ్యమునకు లోపల లేన ట్లింతకంటెఁ ప్రబలము లయిన నిదర్శనములు కానవచ్చుచున్నవి. రాజనరేందుని యనంతరమునఁ చోళులు వేంగిదేశము నాక్రమించుకొన్న తరువాత పండ్రెండవ శతాబ్దమధ్యమునఁ దెనుఁగుదేశములోఁ గొంత భాగము రాజ్యము చేయుచుండిన చళుక్య వంశజుఁడగు చొక్కరాజకాలమునందు భీమకవి యున్నట్లు కొందఱు చెప్పుచున్నారు. ఒకనాఁడు చొక్కరాజుద్యానవనములో మల్లెసాల స్తంభముమీదఁ గాలు చాఁచుకొని కూరుచుండి యచ్చట నున్న భీమకవినిజూచి
శా. 'ఆనీతాభ్యుపదానళృంఖలపదాభ్యాలంబితస్తంభమా!
నేనే వేములవాడ భీమకవినేనిం జిత్రకూటంబు లో
భూనవ్యాపితపల్లవోద్భవమహాపష్పోపగుచ్చంబులన్
నానాపక్వఫలప్రదాయి వగుమా నాకల్పవృక్షాకృతిన్"
అంతట నా పందిరిగుంజ కొమ్మలతోను పత్రములతోను చిగుళ్ళతోను పుష్పములతోను ఫలములతోను పూర్వ మరణ్యములో నున్నట్లు మహా వృక్షమై యా రాజకాలు దానిలోపల చిక్కుపడిపోయెనcట! అక్కడ నున్నవా రందరు నా కవిశక్తి కత్యాశ్చర్యమగ్నమానసులయిరcట! అప్పుడు రాజు తనకాలూడఁదీసికొనలేక మరల నావృక్షమును పందిరికంబమునుగాఁ జేయవలయునని భీమకవినివి ప్రార్ధింపగా నతఁడు
ఉ. శంభువర ప్రసాదకవిసంఘవరేణ్యుఁడ నైన నావచో
గుంభన చేయ నెంతొ యనుకూలత నొంది తనూనభావనన్
గుంభినిఁ జొక్కనామనృపకుంజరుపందిటిమల్లెసాలకున్
స్తంభమురీతి నీతనువుఁ దాలిచి యెప్పటియట్ల యుండుమా."
అను పద్యమును జెప్పి, వృక్షమును మరల యధాపూర్వకముగా పందిరి స్తంభమునుగా మార్చివేసెనఁట ! భాస్కరరామాయణమును కృతినందిన సాహిణిమారఁ డీతని కాలములోనివాఁ డగుటచే భీమకవి పండ్రెండవ శతాబ్దాంతమునను మధ్యమునను జీవించి యుండలేదనియు చొక్క నృపాలుఁడు పండ్రెండవ శతాబ్దమధ్యమునఁగాని యంతమునఁగాని యుండినవాఁడు కాcడనియు, స్థాపించుచున్నది. అప్పకవీయమునం దుదాహరింపబడిన యీ