పుట:Aandhrakavula-charitramu.pdf/400

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

373

వే ము ల వా డ భీ మ క వి

ఇతఁడైదు సంపత్సరములు భూపరిపాలనము చేసెను. రణార్ణవునితండ్రి కామార్ణవుడు; ఇతఁ డేఁబదియేండ్లు ప్రభుత్వము చేసెను. కామార్ణవుని తండ్రి దానార్ణవుఁడు. ఇతఁడు నలువది సంవత్సరములు రాజ్యము చేసెను. ఇతనిరాజ్యకాలము 830 వ సంవత్సర పాంత మయినది. ఈ కాలము మొదలుకొని 1077 వ సంవత్సరము వఱకును కళింగరాజ్య మేలినవారిలో గంగను పేరు గలవాఁడు లేనందున, భీమకవికాలములో నుండిన కళింగగం గింతకుఁ బూర్వపువాఁడు కాఁడని నిశ్చయింపక తప్పదు. ఈతని కాలము లోనే భీమకవి యుండిన పక్షమున, అతఁడు పండ్రెండవ శతాబ్దారంభమున నున్నట్లు తెలుసు గదా? ఈ కాలము సాహిణిమారఁడు మొదలైన వారి కాలముతో సరిపోకున్నది. అందుచేత భీమకవి యీతనికాలములోనివాఁడు కాఁడనియు, తరువాత నున్న వేఱొక కళింగగంగు కాలములో నుండి యుండుననియు ఎంచవలసి యున్నది.

ఇయ్యెడ శ్రీ జయంతి-రామయ్య పంతులుగారు. ఆంధ్ర సాహిత్య పరిషత్తువారు ప్రకటించిన కవిజనాశ్రయ పీఠికలో క్రింది విషయమును వ్రాసియున్నారు.

".......... ఈ పద్యములలో 'గళింగ గంగు' రాయకళింగగంగునని పేర్కొన బడిన రాజెవ్వడో నిర్ణయింపవలయును. 999 వ శతాబ్దము మొదలు రమారమి యఱువది సంవత్సరములు కళింగదేశము ననంతవర్మయను నామాంతరముగల చోడకళింగ గంగ దేవుడు పాలించినట్టు శాసనముల వలన దెలియుచున్నది...........ఈ కాలమునందే రాజరాజచోడగంగను రాజు వేంగీదేశమును బాలించుచుండెను. ఈతఁడు రాజరాజ సరేంద్రుని పౌత్రుఁడు. కాంచీపురము రాజధానిగా వేంగీచోళ దేశముల నేకచ్ఛత్రముగా నేలిన కులోత్తుంగ చోళుని యగ్రపుత్రుండు. తండ్రి యాజ్ఞానుసారముగ వేంగి దేశమును బాలించెను......... ప్రస్తుత విచారమునకు భీమకవి కాశ్రయుండైన రాజు వీరిరువురిలో నెవ్వఁడైన నొక్కటియే ! కాని, కళిగ గంగును సంజ్ఞ యనంతవర్మ చోడగంగ దేవునికే యన్వర్థమగును...... భీమకవి యీతని రాజ్యకాలము పూర్వ భాగములో నుండె ననిన 924 శకా