పుట:Aandhrakavula-charitramu.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

352

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

డునైన తల్లప్పకును, 11 భాగములు కాశ్యపగోత్రుఁడును అన్నదాతాధ్వరిపుత్రుడు నైన సింగయ్యకును, 10 భాగములు కౌండిన్యగోత్రుఁడును రేవణునిపుత్రుడును నైన సింగప్పకును, 13 భాగములు కాశ్యపగోత్రుఁడును నాగయ్యపుత్రుఁడును నైన వత్సయ్యకును, 12 భాగములు శ్రీవత్స గోత్రుఁడును తిమ్మయ్య పుత్రుఁడు నైన భాస్కరునికిని, గ్రామ మాఱుగురు బ్రాహ్మణుల కగ్రహారముగా నియ్యఁబడినది. ఆ యాఱుగురికిని వేఱువేఱుగా రాగి రేకులమీఁద దానశాసనములు చెక్కించి యియ్యఁబడినట్లున్నవి. ఈ శాసనమునకే పుత్రికగా నున్న యింకొక తామ్ర శాసనము ముడియనూరిలోని వేంకటరామశాస్త్రిగారివద్దనుండి గైకొనఁబడి యెపి గ్రాఫికా కర్ణాటికాలో ఎమ్. బీ 158 వ సంఖ్యను బ్రకటింపఁబడినది.

ఈ రెండు శాసనములును బుక్కరాయలయాజ్ఞచే తన్నియుక్తాధికారి యగు విరూపాక్షుని సంతకముతో నేకకాలమున నేకకవి (మల్లనారాధ్యకవి) చే రచియింపఁబడి యేకశిల్పి (నాగిదేవుని) చేతినే చెక్కcబడినవే యయినను, అందందు ముఖ్యభాగములలోనే పాఠ భేదములను గలిగియుండుట వింతగా నున్నది. ఒకదానిలో నాచన సోముని కియ్యఁబడిన భాగములు (36) షట్త్రింశత్తని యుండఁగా రెండవదానిలో (28) షడ్వింశ త్తని యున్నది. ఇరువదియెనిమిది యని చెప్పినచో మొత్తము నూటపది భాగములకు సరిపోదు గాన (ముప్పదియాఱు) షట్త్రింశత్తని యుండుటయే సరియైనది. కవి కాలము ననఁగా దానకాలమును దెలిపెడి ముఖ్యభాగమే వ్యత్యాసము కలదిగా నున్నది. మొదటిదానిలో 'రసభూనయనేందుభిః" అని యున్నపాఠము రెండవదానిలో 'రసాభ్రనయనేందుభిa" అని యున్నది. దానకాలము మొదటి పాఠమునుబట్టి శాలివాహనశకము 1216 వ సంవత్సర మనఁగా క్రీస్తుశకము1294 వ సంవత్సర మగుచున్నది, రెండవ పాఠమునుబట్టి శాలివాహనశకము 1284 వ సంవత్సర మగుచున్నది. ఈ రెంటిలో నే కాలమును బుక్కరాయలరాజ్యకాలములోనిది కాదు. ఆ కాలములో బుక్క రాయలు రాజ్యముచేయకుండుటయేకాక యప్పటి కాతఁడు పుట్టియైన నుండఁడు. శాసనములోని వాక్యములనుబట్టి చూడఁగా బుక్కరాయలు తాను రాజ్యము