358
నా చ న సో ముఁ డు
చేయుచున్న కాలములోనే నాచనసోమునికి దానముచేసినట్టు స్పష్టముగాc దెలియవచ్చుచున్నది. శ్రీచిలుకూరి వీరభద్రరావుగారి యాంధ్రులచరిత్రమునుబట్టి వీరబుక్కరాయలు 1355 వ సంవత్సరము మొదలుకొని 1377 వఱకును భూపరిపాలనము చేసెను. కాcబట్టి శాసనకాలము 1355 నకును 1377 నకును మధ్య దేదో యొక సంవత్సరమయియుండవలెను. అగ్రహారదానసంవత్సరము తారణ యని శాసనము చెప్పుచున్నది. రాజ్యారంభ సంవత్సరము మన్మథ (1555) యు, అంత్యసంవత్సరము నల (1376) యు అగుచున్నవి. ఈ మధ్య ననఁగా బుక్కరాయల రాజ్యకాలములో తారణసంవత్సరము లేనేలేదు. ఉన్న సంవత్సరములో వర్ణోచ్చారణమునుబట్టి తారణకు చేరువ సంబంధముగలది సాధారణ. ఇది బుక్కరాయల రాజ్య కాలములో నుండుటచేత శాసనసంపాదకులైన రైసుదొరగారు తమ పండితులతో నాలోచించి సాధారణసంవత్సరమునకు సరిపోవునట్లుగా 'రనభూసయనేందుభిః" అన్నదానిని 'కరాజనయనేందుభి' అని సవరించి శాలివాహనశకము 1292 అనఁగా క్రీస్తుశకము 1330 వ సంవత్సరమగునట్లు చేసిరి. అప్పడు శాసనశ్లోక మీ విధముగా మాఱుచున్నది.
"అలంకృతే శకస్యాబ్దే కరాజనయనేందుభిః
సాధారణే చైత్రమానే నవమ్యాం శుక్లపక్షకే."
కర-2, అజి - 9, నయన -2, ఇందు -1-2921 కుడినుండి యెడమకు 1292 శకవర్షమగుచున్నది. శాసనసంవత్సర మిదియే కావచ్చును గాని యీ యూహాయే సరియైన దని నిశ్చయముగాఁ జెప్పవలనుపడదు. ఈ మార్పును సూచించిన శాసనసంపాదకులగు రైసుదొరగారు తమ యింగ్లీషు భాషాంతరములో పుట యడుగున నీక్రింది నివేదనము చేసి యున్నారు.
Note - “Thıs is given as the Saka year rasa bhu nayana indu (= 1216), the year Tarana. Buat This does not fall within Bukka’s reign, during which there