336
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
వయస్సు చెల్లినవాఁడయి మోక్షార్థి యయి యున్నవాఁ డగుటచేత నారణ్య కాండమును గై కొని యుండును. ఆ కాలమునందుసు సకారణముగానో యకారణముగానో భారతారణ్యపర్వమువలనే రామాయణారణ్యకాండము శుభదాయకము కాదన్న నమ్మకము సామాన్యముగా జనులలో వ్యాపించి యున్నది. పిన్నయీడువాఁడైన మల్లికార్జునభట్టేండ్లు చెల్లినవాఁడైన తండ్రికంటె నధిక వేగముగా పద్యరచన చేయఁగల కవితాధార కలవాఁ డగుటచే జనకుఁ డారణ్యకాండమును ముగింపకముందే తన బాలకాండమును ముగించి తన సహపాఠియైన కుమారరుద్ర దేవుని కిచ్చిన యయోధ్యాకాండమును, తండ్రి చేయుచుండిన యారణ్యకాండమును విడిచిపెట్టి కిష్కింధా కాండమును జేయనారంభించెను ఇంతలోపల భా స్కరుఁడు తన యారణ్య కాండమును ముగించి కొడుకు చేయుచున్న కిష్కింధాకాండము తరువాయి నందుకొని దానిని పరిసమాప్తినొందించి సుందరకాండమును జేయ నారంభించెను. తరువాత మల్లికార్జునభట్టందుకొని సుందరకాండమును జేయుచుండఁగా మిత్రుఁడై న యయ్యలార్యుఁ డాతని యనుమతిమీఁదనే యుద్ధకాండముయొక్క యుత్తరభాగమును గైకొని రామాయణమును తుదముట్టించి యుండును[1]
ఈ రామాయణము పలువురచేఁ దెనిఁగింపబడిన దగుటచేత శైలియు బహువిధములుగా నుండును అరణ్యకాండముకవిత్వము తక్కినవాని కవిత్వము కంటె రసవంతముగా నుండును ఇందు కవిత్రయమువారి ప్రయోగములకు విరుద్ధము లయిన ప్రయోగములు కొన్ని కానఁబడుచున్నను, పూర్వలాక్షణికు లెల్లరు భాస్కరరామాయణమును ప్రామాణిక గ్రంథముగా నంగీకరించి యున్నారు. వారివారి శైలులు తేటపడుటకయి యిందు క్రిందఁ గొన్ని పద్యముల నుదాహరించుచున్నాను.
- ↑ [ఈ వాక్యములన్నియు నూహలపైనే యాధారపడియున్నవనియు, ఆ యూహలలోఁ గొన్ని పరిశీలనము చేసి చూచునప్పడు నిలుచునవి కావనియు 'ఆంధ్ర కవితరంగిణి'లోఁ గలదు.]