పుట:Aandhrakavula-charitramu.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

335

హు ళ క్కి భా స్క రు డు

మని వేఁడఁగా మిత్రానురాగముచేతను శిష్యవాత్సల్యముచేతను వారి కోరికను నిరాకరింపక యంగీకరించుట స్వాభావికసౌజన్యసూచకముకాదా ? ఈ ప్రకారముగాఁ దన పుత్త్రునకును ఛాత్రునకును మిత్రునకును భాస్కరుఁడు కొంతకొంత భాగ మిచ్చి తా నొక భాగమును బుచ్చుకొని వారు చేయుచు వచ్చినదానిని తా నప్పడప్పడు చదివి సంస్కరించుచు నడుమ నడుముఁ దన పద్యములను జేర్చుచు శ్లాఘ్యముగా నున్నదానిని తన పుస్తకములోని భాగముగా స్వీకరించుచు వచ్చి యుండును. ఈ హేతువు చేతనే రామాయణమునకు మూఁడు కాండములు చేసిన మల్లికార్జనభట్టు పేరురాక యొక కాండమునో, కాండమునరనో చెసిన భాస్కరుని పేరు వచ్చెననుటకు సందేహములేదు. తండ్రికి కుమారుని పేరు ప్రసిద్దికి వచ్చునప్పటి కంటె నెక్కువ సంతోషము వేఱొకప్పడు కలుగదు. అందుచేత నే తన కుమారునిని మూఁడు కాండములు తన రామాయణములో నుంచుట కంగీకరించి యతఁడు కృతార్ధుఁడయ్యెను. సద్గురువునకు స్వపుత్రునియందు వలెనే సచ్ఛాత్రుని యందును నత్యంత ప్రీతి యుండును. అందుచేతనే భాస్కరుఁడు తన ప్రియశిష్యుఁడు చేసిన కాండమును సహితము తన పుస్తకములో నుంచుట కంగీకరించి యుండును. ఈ కుమారరుద్రదేవుఁడు సామాన్య శిష్యుఁడు గాక భాస్కరమహాకవి కాశ్రయుc డెన సాహిణి మారయ ప్రభువునకు పుత్రుఁడయి కూడ నుండెను. తన సుతుఁడు కవియగుటయు నాతనికవిత్వము తన కంకిత మొనర్పఁబడిన పుస్తకములో నుండుటయు రాజునకు సహితము పరమ ప్రీతికరముగానే యుండును.

భాస్కరుఁడు మొట్టమొదటఁ దన కుమారుఁడైన మల్లికార్జునభట్టునకు బాల కాండమును, శిష్యుఁడైన కుమారరుద్ర దేవున కయోధ్యాకాండమును తెనిఁగించుట కిచ్చి తా నారణ్యకాండమును బుచ్చుకొని యుండును. తానే మొదటిదైన బాలకాండమును బుచ్చుకొని యితరులకే తరువాతి కాండముల నియ్యక తా నేల యారణ్యకాండమును బుచ్చుకోవలెనని కొంద ఱడుగ వచ్చును. వర్ణిష్ణువులయి చిరకాలము మనఁగోరెడి తరుణ వయస్కు లైన వారి కా కాండము నియ్యక వారి శ్రేయస్సును గోరియే యతఁడు తాను