పుట:Aandhrakavula-charitramu.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

333

హు ళ క్కి భా స్క రు డు

సత్యసరస్వతులగు మీ రాడినమాట దాఁటగూడ" దని ప్రార్ధింపఁగా భాస్కరుఁడు రామాయణమున కాతనిని కృతిపతినిగాc జేసినట్టును, ఒక కథ చెప్పుచున్నారు.

కాని యది సత్యముకాదు. ఇటీవలివారు "సాహిణి" యను పదమును జూచి భ్రమించి యీ కథ కల్పించియుందురు. రాజు గ్రంథమును శీఘ్రముగా సాంతము చేయింపవలెనని కోరియుండుటచేత భాస్కరరామాయణ మి ట్లందరిచేత వ్రాయఁబడియుండును. కొందఱీ సంబంధమున మంత్రి భాస్కరుని విడచి హుళక్కి భాస్కరుఁడే రంగనాధుని మీఁది పోటికిఁ దన పుత్ర మిత్రచ్చాత్రులచేతఁ బుస్తకమును బూర్తి చేయించెనని కథ యింకొకవిధము మార్చి చెప్పుదురు. అప్పుడు సహిత మీ కథ యధిక విశ్వాసార్హమైనది కాఁజాలదు. రంగనాధుఁడును, హుళక్కి భాస్కరుఁడును నేకకాలమునందుండినవారు కారు. ఇరువురకు నడుమను నూఱు సంవత్సరములంతరము గలదు. ఒకఁడు ముత్తాత బుద్ధరాజు కాలములోనుండిన, రెండవవాఁడు మునిమనుమనికాలములో నుండినవాఁ డగును. హుళక్కి భాస్కరుఁడు యుద్ధకాండమునందలి పూర్వభాగమును రచియించిన ట్లయ్యలార్య ప్రణీతంబయిన యూ క్రిందిపద్యమువలన నెఱుఁగవచ్చును.

        చ. 'అమర హుళక్కిభాస్కరమహాకవి చెప్పఁగ నున్న యుద్ధకాం
            డమతరువాయి చెప్పె వికట ప్రతిభాషణుఁ డప్పనార్యస
            త్తమసుతుఁ డయ్యలార్యుఁడు కృతస్థితి నార్యులు మెచ్చునట్లుగా
            హిమకరతారభాస్కరమహీవలయస్థిరలక్ష్మి చేకుఱన్."
                                            [యుద్ధకాండము 2583]

భాస్కరరామాయణము మొదట పదునాల్గవ శతాబ్దారంభమునందుఁ దెనిఁ గింపఁబడియుండుటచేత భాస్కరరామాయణము పుట్టి యిప్పటి కాఱువందల సంవత్సరములు కావచ్చినది. సోమదేవరాజీయమునందుఁ బ్రతాపరుద్రుఁడు కొలుపుతీఱి యున్నప్పుడు దర్శింప వచ్చినవారిని వర్ణించుచో "శాకల్లి మల్లికార్జునభట్టు మొదలైన బ్రహ్మవిద్వాంసులు నూటయేబండ్రును, హళక్కిభాస్కరుఁడు మొదలుగాఁగల ప్రబంధ కవీశ్వరు లిన్నూఱుగురును