పుట:Aandhrakavula-charitramu.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

332

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

బుద్ధరాజు తన బంధుఁడైన రంగనాధునిచేత ద్విపదరామాయణము చేయించుచున్నట్లును, ఆ గ్రంథము మూఁడు వంతులు ముగింపఁబడిన వెనుక మంత్రియైన భాస్కరుని కా సంగతి దెలిసి యతఁడు రాజుతోఁ దాను రామాయణమును పద్యకావ్యమునుగాఁ జేసి కృతి యిచ్చెదనని చెప్పఁగా ముందుగాఁ జేసి తెచ్చిన గ్రంథము కృతినందెద నని రాజు చెప్పినట్లును. అందుమీఁద నతఁడు గ్రంథమును శీఘ్రముగాఁ జేయింప నెంచి తన యాశ్రితుఁడును, కవీంద్రుఁడునైన హుళక్కి భాస్కరువి బిలిపించి చెప్పఁగా నతc డారణ్యకాండమును మాత్రము చెప్పక తక్కిన భాగమును తెనిఁగించి తెచ్చెదనని యొప్పుకొని పోయినట్టును, ఆరణ్యపర్వమును తెనిఁగించిన నన్నయభట్టునకు వచ్చిన దురవస్థయే యారణ్యకాండ మును జేసినయెడలఁ దనకును వచ్చునని హుళక్కి భాస్కరుఁడు జడియుట చేత దానినిమాత్రము మంత్రి భాస్కరుఁడు రచియించినట్లును, హుళక్కిభాస్కరుఁ డింటికిఁ బోయి తన పుత్రుఁడైన మల్లికార్డునభట్టుచేత బాల కాండమును, కిష్కింధాకాండమును, సుందరకాండమును, శిష్యుఁడైన కుమారరుద్రదేవునిచేత నయోధ్యాకాండంబును, మిత్రుఁడై న యయ్యలార్యునిచేత తాను రచియింపఁబూనిన యుద్ధకాండమునందలి కడపటి భాగమును జేయించి తాను యుద్ధకాండము యొక్క మొదటిభాగమును రచియించి మంత్రి భాస్కరునియొద్దకుఁ గొనిపోయి సమర్పించినట్లును, మంత్రి భాస్కరుఁడు తాను రచించిన యారణ్యకాండమునుగూడఁ జేర్చి రామాయణము నంతను రాజునొద్దకుఁ గొనిపోయినప్పడే రంగనాధుఁడును తన ద్విపద రామాయణమునుగూడ తేఁగా రాజు కుడిచేతితో రంగనాధుని రామాయణమును, ఎడమచేతితో భాస్కరుని రామాయణమును గ్రహించినట్లును, అందుమీఁదఁ దన్ను లాఘవపఱచినందునకయి భాస్కరునికి గోపమువచ్చి, యిటువంటి రాజునకు గ్రంథమును కృతి యిచ్చుటకంటె గుఱ్ఱములను కాచువాని కీ కృతి యిచ్చుట మేలని పలుకుచు నతఁడు కొలువువిడచి లేచిపోయినట్టును, ఆతఁడు పోవుచుండఁగా నక్కడనుండి యా మాటలు వినుచున్న మారడన్న గుఱ్ఱపువాఁడెదురుగా వచ్చి యాతనికి నమస్కరించి "స్వామీ!