334
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
......ఆశ్వంబుల కధికారియైన సాహిణి మారనయు . కొలువఁ బేరోలగంబున సుఖోపవిష్ణుండై "- అని వ్రాయcబడియున్నది. వీ రందఱును ప్రతాప రుద్రునికాలములోనే యుండినందున, వీరు పదుమూడవ శతాబ్దాంతము నందును పదునాలవ శతాబ్దారంభమునందును నుండి యుండవలెను. సాహిణి మారని కాలములో ననఁగా 1295 వ సంవత్సరము మొదలుకొని 1320 వ సంవత్సరప్రాంతమువఱకును రాజ్యపాలనముచేసిన ద్వితీయ ప్రతాపరుద్ర చక్రవర్తికాలములోను, దరువాతను మహావిద్వాంసుఁడును మహాకవియు నయి హుళక్కిభాస్కరుఁడు మిక్కిలి ప్రసిద్ధిచెందినవాఁడు. అందుచేత నాతవికిఁ గవులును, పండితులును మిత్రులయి యుండుటయే కాక విద్యను, గవిత్వమును నేర్చుకొనుచుండిన ఛాత్రులును పలువురుండి యుందురనుటకు సందేహము లేదు. శ్రీనాధునికాలములో ననఁగా పదునాల్గవ శతాబ్దాంతమునందును పదునైదవ శతాబ్దాదియcదును నుండిన వల్లభామాత్యుఁడు [1] తన క్రీడాభిరామమునందు
ఉ. "నన్నయభట్టతిక్కకవినాయకు లన్న హుళక్కిభాస్కరుం
డన్నను జిమ్మపూడి యమరాధిపుఁ డన్నను సత్కవీశ్వరుల్
నెన్నుదుటం గరాంజలులు [2] నింతలు చేయనిరావితాపాటి తి
ప్పన్నయు నంతవాఁడె తగునా యిటుదోసపుమాట లాడఁగన్."
అని తనకంటె నేఁబదియఱువది సంవత్సరములు పూర్వమునం దుండిన హుళక్కి భాస్కరుని నన్నయతి క్కనాదులతో సమానునిగాఁ బొగడుటయే యాతని ప్రసిద్ధిని వేయినోళ్లఁ జాటుచున్నది. అట్టి సుప్రసిద్దకవికడ మిత్రులను బలువురు చేరి కవిత్వమును నేర్చుకొనుచుండుటయుఁ దాము చేసిన గ్రంధములను పద్యములను గురువునకుఁ జూపి దిద్దించుకొని యాతని మెప్పు పడయఁ జూచుచుండుటయ వింత కాదుగదా! భాస్కరుఁడు రామాయణరచనకుఁ బూనినప్పుడు తామును గొంతభాగమును జేసి చూపెద