పుట:Aandhrakavula-charitramu.pdf/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

9

న న్న య భ ట్టు

గానే "భట్ట" శబ్దము చెల్లుచుండినను, నన్నయభట్టు తాను రాజు యొక్క కులబ్రాహ్మణుఁ డయినట్టు " తన కులబ్రాహ్మణు ననురక్తు నవిరళ జప హోమతత్పరు . . . ...నన్నపార్యు జూచి పరమధర్మవిదుఁడు వరచళుక్యాన్వయాభరణుఁ డిట్టు లనియెఁ గరుణతోడ" నని యాదిపర్వములోఁ జెప్పుకొని యుండుటచేత నన్నయ వైదికశిఖామణి యనియే నిశ్చయింప వలసియున్నది. కుల బ్రాహ్మణులయి వంశపరంపరగా రాజపురోహితత్వము నిర్వర్తించుచుండుట వైదికులలోనే కాని నియోగులలో లేదు. ఇంకొకరు, చాళుక్యులు పశ్చిమమునుండి వచ్చినవా రగుటచేత నన్నయభట్టు మహారాష్ట్ర దేశ ప్రాంతములనుండి రాజరాజనరేంద్రుని పూర్వుల వెంట వచ్చిన బ్రాహ్మణులసంతతివాఁ డయి యుండునని వ్రాసి యున్నారు. అదియు విశ్వసనీయము కాదు. *[1] నన్నయ వేఁగినాటి బ్రాహ్మణుఁ డని యూహించుటకుఁ దగిన నిదర్శనములు నన్నయార్య విరచితమైన భారత భాగములోనే కనుపట్టుచున్నవి. ఇతఁ డర్జునుని తిర్ధయాత్రలను వివరించటంలో నీ క్రింది వర్ణనము నాదిపర్వమునందుఁ జేసియున్నాఁడు.

         " సీ. దక్షిణగంగ నాఁ దద్దయు నొప్పిన గోదావరియు జగదాది యైన
              భీమేశ్వరంబును బెడఁగగుచున్న శ్రీపర్వతంబునుజూచి యుర్విలోన
              ననఘమై శిష్టాగ్రహారభూయిష్టమై ధరణీసురోత్తమాధ్వరవిధాన
              పుణ్యసమృద్దమై పొలుచువేఁగీదేశవిభవంబుఁజూచుచు విభుఁడు దక్షి
         
           గీ. ణాంబురాశితీరంబున కరిగి దురిత
              హారియైన కావేరీమహా సముద్ర
              సంగమంబున భూసురేశ్వరుల కభిమ
              తార్థదానంబుఁ జేసి కృతార్థుఁ డగుదు."

స్వదేశమునం దభిమాన మెల్ల పారికిని సహజ మయి యుండును గదా ! ఈతఁడు వేగిఁనాటివాcడగుటచేతనే మూలగ్రంథమైన సంస్కృత మహాభారతములో లేని వేఁగిదేశ మహత్త్వవర్ణనము నుత్తమ విశేష గుణములతోఁ

  1. * నన్నయభట్టు కర్ణాటకుఁడని కొందఱు తలంచుచున్నారు, ఈ యభిప్రాయము కూడ సరికాదు.