Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

దెలుఁగు భారతమునఁ జొప్పించి తనయనూనదేశాభిమానమును గనఁబఱిచి యున్నాఁడు.

నన్నయ వేదాధ్యయన సంపన్నుఁడు. ఇతఁడు సంస్కృతాంధ్రభాషల యందసమాన పాండిత్యము కలవాఁడయి, ఉభయభాషలయందును గవిత్వము చెప్పటకు సమర్ధుఁడయి యుండెను. తక్కిన తెలుఁగు గ్రంథములయందువలెఁ గాక యితఁడాంధ్రభారతాదియందు దేవతా స్తుతి నిట్లు సంస్కృతశ్లోకముతోఁ జేసి యున్నాడు

             శ్లో. శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే
                 లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవామ్
                 తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
                 ర్భూయాసుః పురుషోత్తమాంబుజభవశ్రీకంధరా శ్శ్రేయసే

ఇతఁ డవతారికలో షష్ట్యంతపద్యములు వేయలేదు. భాస్కరరామాయణ మీ విషయమున దీనిని బోలి యున్నది. స్వప్నకధను షష్ఠ్యంతములను మొట్టమొదట జేర్చినవాఁడు తిక్కనసోమయాజియే. ఆతనిని జూచి యించుమించుగాఁ దరువాతికవు లందఱును దమకు స్వప్నములో నిష్ట దేవతా సాక్షాత్కారమును షష్ట్యంతపద్యములను దమ గ్రంధములలో వెఱ్ఱిగా నేఁటి వఱకును వేసికొనుచున్నారు. నన్నయభట్టారకుఁడు భారతములోఁ దన్ను గూర్చి యీ యొక్క పద్యమును మాత్రము వేసికొన్నాఁడు.*[1]

సీ. తన కుల బ్రాహ్మణుల ననురక్తు నవిరళ
          జపహోమతత్పరు విపులశబ్ద
     శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది
          నానాపురాణవిజ్ఞాననిరతుఁ
    బాత్రు నాపస్తంబసూత్రు ముద్గలగోత్ర
          జాతు సద్వినుతావదాతచరితు
    లోకజ్ఞ నుభయభాషా కావ్యరచనాభి
           శోభితు సత్ప్రతిభాభిభియోగ్యు

  1. * నన్నయభట్టు తన పూర్వులను గూర్చి ఏమియు తెలుపలేదు. నన్నయ రణస్థిపూఁడి శాసనమును వ్రాసిన భీమన భట్టు యొక్క కాని, కోరుమిల్లి శాసనమును రచించిన. బేత నభట్టు యొక్క కాని కుమారుఁడయి యుండునని 'ఆంధ్రకవి తరంగిణి' కర్త శ్రీ చాగంటి శేషయ్యగారు తెలిపియున్నారు.