ఈ పుట ఆమోదించబడ్డది
ఆంధ్ర కవుల చరిత్రము
పూర్వకవులు
నన్నయ భట్టు
నన్నయభట్టారకుఁడు *[1]సంస్కృతభారతమును దినిఁగింప నారంభించిన కవి. ఇతఁడు ముద్దలగోత్రజాతుఁడగు వైదికబ్రాహ్మణుఁడు. ఒకానొకరీతఁడు వైదిక బ్రాహ్మణుఁడు కాcడనియు, తెలుఁగు కవిత్వమునకు మొదటినుండియు నియోగులే ప్రసిద్దులయి యుండుటచేత నీతఁడును నియోగియేయయి యుండుననియు, భట్ట శబ్దధారణ మాత్రముచేత నీతఁడు వైదికియని భ్రమింపగూడదనియు, నియోగియైన శ్రీనాధ కవి గూడ తన కాశీఖండము లోని "చిన్నారిపొన్నారి చిఖతకూఁకటినాఁడు" అను పద్యములోఁ దన్నుఁ గూర్చి " శ్రీనాథ భట్టసుకవి " యవి చెప్పికొనియెననియు, వ్రాసియున్నారు. నన్నయభట్టారకుని కొలమునాఁటికే యాంధ్రస్మార్త బ్రాహ్మణులలో వైదిక నియోగి భేద మేర్పడియుండినను, నియోగివైదికుల కిరువురకును సమానము
- ↑ * భారతమునందలి యొక పద్యము (ఆది-1-25] ను బట్టి యితనికి నన్నయభట్టు అనియు ఆదిపర్వమునందలి వేఱొక [1-9] పద్యమును బట్టి నన్నపార్యుఁడనియు నామములు ప్రసిద్దములైనట్టు తెలియుచున్నది. శాసనములంబట్టి 'నన్నియభట్ట'ను నామమున్నట్లు తెలియుచున్నది. కొందఱు విమర్శకులు భారత రచయితయగు నన్నయ కంటె శాసనరచయిత భిన్నుఁడను నభిప్రాయమును తెల్పియున్నారు. కాని యిర్వురు నభిన్నవ్యక్తులు. ' నన్నియ' ప్రాచీనరూపము; 'నన్నయ' ? నవీనరూపము.