పుట:Aandhrakavula-charitramu.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

305

మా ర న

మఱియొక గొప్ప సేనను పంపఁగా సేనాధిపతి ఘోరయుద్ధములో ప్రతాపరుద్రుని పట్టుకొని ఢిల్లీ నగరమునకుఁ గొనిపోయెను. ప్రతాపరుద్రునిమంత్రి యైన యుగంధరుఁడు తన ప్రభువును వదలించి తెచ్చిన ట్లొక విచిత్రమైన కధను చెప్పదురు. తన ప్రభువును మహమ్మదీయులు కొనిపోయినతరువాత మంత్రి యుగంధరుఁడు తా నొక మనోహరమైన పడవను కట్టించి దాని యందు రత్నఖచితములై న భూషణములు వేసికొని వాణిజ్యమునిమిత్తమై పోయినట్లుగా గంగానదిమీcదుగా పోయి ఢిల్లీ నగరము చేరి యమ్మకము నిమిత్తమై యమూల్యములైన రత్నములు తెచ్చితిమని తన మనుష్యుల చేత ఫాదుషాకు చెప్పి పంపి చూచుట కయి యొక దిన మేర్పఱిచెను. ఈ ప్రకారముగాఁ జేయవలసిన యేర్పాటుల నన్నిటిని చేసి తాను పడవ దిగి పట్టణమునందు పిచ్చివానివలె తిరుగుచు నేటి కిన్ని దినములకు ఢిల్లీచక్రవర్తిని కారాబద్దునిగాఁ గొని పోయెద మని యొక చింపిచేటతో చాటుచు, రాత్రులూరి వెలుపల నున్న యొక మఱ్ఱిచెట్టు క్రింద శుచియై వంట చేసికొని భుజించుచు, మాఱువేషముతో నటించుచుండెను. ఈ రీతిగా ప్రతిదినమును పిచ్చిగా చాటుచుండుట రాజభటులు చూచి, రాత్రు లీతఁడు మఱ్ఱిచెట్టువంక పోవుచుండుటచారులవలన దెలిసికొవి, ఒకనాఁడు పగలు గూఢముగా పోయి మఱ్ఱిచెట్టుమీఁద నెక్కి కూరుచుండి యుండిరి.అతడు పగలంత యు నూరంతటను జాటి యథాప్రకారము రాత్రి మఱ్ఱిచెట్టుకడకు వచ్చి శుచియై వంట చేసికొని తినుట కన్నము విస్తరిలో వడ్డించుకొన్నతరువాత నతని కాపులింత యొకటి వచ్చెనఁట ! అప్పు డతఁడు వింత లేనిది యావులింత రాదనుకొని నిదానించి చూచి వెన్నెలలో చెట్టునీడనుబట్టి పయి నెవ్వరో మనుష్యు లున్నారని తెలిసికొని, పయివంకఁ జూచిన ననుమాన పడదురని యట్లు చేయక, వడ్డించుకొన్న యన్నముమీఁద వంటచేసిన కుండను బోర్లించి విస్తరిచుట్టును ముమ్మారు బ్రదక్షిణములు చేసి, ఢిలీ చక్రవర్తిని పట్టుకొని తమ యూరు కొనిపోదుమని పెద్దకేక వేసి, తనచేతికఱ్ఱతో కుండను పగులగొట్టి యన్నము తినక లేచిపోయెను. భటు లంతట నితఁడు పిచ్చివాఁడని నిశ్చయము చేసికొని వెడలిపోయి చక్రవ ర్తి కా వార్త తెలిపి