పుట:Aandhrakavula-charitramu.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

306

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

తమతమ పనులమీఁద నుండిరి. గడువుదినమున ప్రతాపరుద్రుని తనవెంట నుంచుకొని పరిమిత పరివారముతో చక్రవర్తి యోడవద్దకి పోవుటకు బయలు దేఱగా యుగంధరుఁడు చక్రవర్తి నిప్పుడే పట్టుకొని పోయెద మని చింపిచేటతో చాటుచు వెంటఁబడెను. రాజభటు లాతనిని పిచ్చివానిఁగా భావించుటచేత నాతని మాటలను లక్ష్యముచేయక వెంట రానిచ్చిరి. అంతట నతడు చక్రవర్తిపరిజనులు చూడకుండ పడవ నెక్కి- పయిని కూర్చుండి చక్రవర్తిని పట్టుకొని పోవుచున్నామని చాట మొదలుపెట్టెనఁట • ఫాదుషా లోపల నున్న సరకులను పరీక్షించుచుఁ గొంతసేపు లోపలనుండి పయికి వచ్చి చూచునప్పటికి పడవ తమరేవున లేక బహుదూరము వచ్చినట్లు కనఁబడఁగా, ఆది యంతయు శత్రువుల కుతంత్రమువలన నయినదని తెలిసికొని చేయునది లేక ప్రతాపరుద్రునితో సమాధానము చేసికొని యాతని రాజ్యమును మరల నిచ్చివేసి విడుదల పొంది తాను తన రాజధానికి మరలి పోయెనcట! ప్రతాపరుద్రునిమంత్రులలో యుగంధరుఁడనువాఁ డెవ్వఁడును లేఁడు. యుగంధరుఁడు మిక్కిలి పూర్వకాలమునందు అత్యంత ప్రసిద్దుడయిన యొక మంత్రి శిఖామణి. శ్రీహర్షకవిచేత సంస్కృతమున రచియింపఁబడిన 'రత్నావళి " నాటికయందే యుగంధరుని సంతతివాఁడు (యౌగంధరాయణుఁడు) మంత్రిగాఁ జెప్పబడెను. మారనకవి నాగయగన్నని " నీతి యుగcధరc" డని చెప్పెను.

[యౌగంధరాయణుఁడు గొప్పరాజనీతిజ్ఞఁడుగను, ప్రభుకార్యతత్పరుఁడుగను భాసుని నాటకములందుఁ బ్రసిద్ధుఁడు. భాసుననుసరించియే శ్రీహర్షదేవుఁడు "రత్నావళి"ని రచించెను. యౌగంధరాయణుఁడు ప్రతాపరుద్రుని విడిపించి, ఢిల్లీచక్రవ ర్తిని చెఱఁగొనిన కథసు శ్రీ వేదము వేంకటరాయ శాస్త్రిగారు తమ 'ప్రతాపరుద్రీయనాటకము'నఁ గూర్చినారు. ఈ వృత్తాంతము విశ్వాసార్హము కాదని విమర్శకులు చరిత్ర కారులును తెలిపియున్నారు.

నాగయగన్నసేనాని ప్రతాపరుద్రుని యనంతరము మహమ్మదీయ మతమును గైకొని ఢిల్లీచక్రవర్తిని సేవించినట్లును, ఆతవికి సేనానియై రాజ్యకార్యములను నిర్వహించినట్లును శ్రీ నేలటూరు వేంకటరమణయ్య గారు తెలిపియున్నారు (భారతి-బహుధాన్య-మాఘమాసము)