పుట:Aandhrakavula-charitramu.pdf/287

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

260

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

నాధుఁ డగుననియు, అతని పేరిట రచితమైన రామాయణము "రంగనాథ రామాయణ' మయ్యెననియు కొందఱి యభిప్రాయము. ఇది యుక్తిసహము కాదని పెక్కండ్రు తలంచుచున్నారు.

విఠ్ఠలరాజు "రామాయణమును రచింపఁదగినవాఁ డెవ్వడు?" అని ప్రశ్నింపఁగా సభ్యులతని పుత్రుఁడగు బుద్ధరాజే తగినవాఁడని చెప్పినట్లును, పిదప తండ్రి పుత్రుని రామాయణము ను రచింపఁ గోరినట్లును కృత్యాదిని బట్టి తెలియుచున్నది. పుత్రుని శక్తి సామర్థ్యములు తండ్రికిఁ దెలియకుండుట వింతగానే తోఁచును. ఉత్తరకాండమును ద్విపదగా తెలిఁగించిన బుద్ధరాజు పుత్రులు కాచవిఁభుడును. విఠ్ఠలరాజును ఇచ్చిన వంశవృక్షము నకును, రంగనాధ రామాయణము నందలి వంశవృక్షమునకును భేదము కానవచ్చుచున్నది. ఈ విషయమున నింకను పరిశోధన జరుగవలసియున్నది]