259
రంగనాథుఁడు
నాధుఁడే చక్రపాణి రంగనాథుఁడు. తొలుత వైష్ణవుఁడు వైష్ణవుఁడుగా నున్నపుడే రామాయణమును రచించెను.
ఇతఁడు వీరశైవుఁడగు పాలకురికి సోమనాథునితో వాదింపఁబోయి--ఆతc డీతనిం జూడ నిష్టపడకపోఁగా, సోమనాథుని కుమారుఁడగు చతుర్ముఖ బసవేశ్వరునితో వాదించి, యోడిపోయి శ్రీశైలమార్గమునఁ బోవుచు, మల్లికార్జునస్వామిని జూడనందున కన్నులు కానరాకుండఁబోయెననియు, నీతడహోబలమునకుఁ బోయి నరసింహదేవుని పార్థింపఁగా నాతఁడు స్వప్నమునఁ గానవచ్చి శివద్వేషము తగదని బోధించెననియు, రంగనాథుఁడు శ్రీశైలమునకుఁ బోయి దేవుని స్తుతింపఁగా నొకకన్ను వచ్చెననియు, సోమనాథుని యనుగ్రహమున రెండవకన్నుకూడ లభించెననియు నొక వదంతి కలదు. ఈ కధ సంగతి యెటులున్నను. ఇతడు సోమనాథ సమకాలికుఁడనియు, నీతఁడే ద్విపదరామాయణకర్తయనియు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు మున్నగువా రభిప్రాయపడినారు. తొలుత వైష్ణవుడై రామాయణమును రచించినను, పిదప శైవుఁడగుటలో విరోధములేదు. తెనాలి రామలింగడు తొలుత శైవుడై పిదప రామకృష్ణుడైన సంగతి యెల్లరకును తెల్లమేకదా ! రంగనాథుఁడు శైవుఁడై పిదప "శివభక్తిదీపిక" యను నొక చిన్నగ్రంధమును, 'నయనగతిరగడ 'లో రచించెనట!
చక్రపాణి రంగనాధుఁడును, రామాయణకర్త యని చెప్పఁబడు రంగనాధుఁడును విభిన్న వ్యక్తులని 'ఆంధ్రకవి తరంగిణి" కారు లభిప్రాయ పడుచున్నారు [మూఁడవ సంపుటము పుటలు 155-156] మఱియు నీ రంగనాధుఁడు 'శ్రీగిరినాథ విక్రమ" మను నాంధ్రకావ్యమును, వీరభద్ర విజయము, శరభలీలా అను కన్నడగ్రంధములను రచించెనని చెప్పుదురని అందే కలదు. [మూఁడవ సంపుటము, పుట 156]
రంగనాథ రామాయణమును గోన బుద్దరాజే తన తండ్రి విఠ్ఠలరాజు పేరిట వ్రాసెననియు, విఠ్ఠలుఁడే పాండురంగఁడు గాన, అతఁడు పాండురంగనాధుఁడు కావచ్చుననియు, ఆ పదమును హ్రస్వ మొనర్చినచో 'రంగ