258
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
యినరశ్మి వాడిన యెలదీగపోలె
ఘన ధూమయాత్రదీపకళికయుఁబోలె
జలదమాలికలోని శశికళ వోలెఁ
బలు మంచుపొదవిన పద్మినివోలెఁ
జెలగి పిల్లులలోని చిలుకయుఁబోలె
బులులలో నావునుబోలె దుర్వార
ఘోరరాక్షస వధూకోటిలో నున్న
నారీశిరోమణి నలినాయతాక్షి. ---సుందరకాండము.
ద్వి. కృతకృత్యుఁ డగు రాముకీర్తిపుష్పములు
చతురతమై వెదచల్లినయట్లు
కర మొప్పఁ జుక్కలు కాన్పించె నంతఁ
జిరకాలములసీమ శిశువులమామ
పొలుపొందు కలువలపోరానివిందు
కలసిన జక్కవకవఁ బాపుమందు
పాలవెల్లిని ద్రచ్చి పడసిన వెన్న
శూలియౌదలపువ్వు చుక్కలనవ్వు
నెరిచకోరములకు నెల నెలపంట
యురవేది విరహుల నుడికించు మంట
గగనంబులొడవు దొంగలగుండెదిగులు
నొగి నబ్ధిఁ బొంగించు నూఱటపట్టి
హరిహరబ్రహ్మల యానందదృష్టి
సరసిజరిపుఁడైన చంద్రుడు పొడిచె. ---యుద్ధకాండము.
[ ఈ రంగనాథునిఁ గూర్చియు, ద్విపదరామాయణకర్తృత్వముసుగూర్చియు వాదవివాదములు అభిప్రాయ భేదములును వెలసినవి. రామాయణమున రంగనాధుని పేరు లేకున్నను, అతని పేరనే వాడుకలోనున్నందున నతఁడే రామాయణకర్తయని కొందఱు విమర్శకులు నమ్ముచున్నారు. ఈ రంగ