Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

257

రంగనాథుఁడు

రంగనాధుని కవిత్వము మృదుమధుర పదబంధయుత మయి శబ్దార్ధాలంకారసంయుతమయి యన్వయకాఠిన్య విరహితమయి మనోహరముగా నుండును. కవి శైలి తెలియుట కయి కొన్ని పద్యములను వ్రాసి యీతని చరిత్రము నింతటితో ముగించు చున్నాను.

          ద్వి. 'నడురాత్రి యరుదెంచె నరలోకనాధ
                కడు డస్సినాడవు కనుమోడ్తు గాక!
                చలియింపకున్నవి సకలవృక్షములు.
                మెలఁగవు వనభూమి మృగసఘూహములు;
                నెఱి విహంగంబులు నీడము ల్చేరి
                మఱచియున్నవి తమ మంజులధ్వనులు;- బాలకాండము

          ద్వి. కోమలి కేకయకులమునఁ బుట్టి
                యీ మాటలాడ నోరెట్లాడె నీకు ?
                అడవులపాలు కమ్మని రాముఁ ద్రోవ
                నెడపక తొల్లి నీ కేగ్గేమి చేసె
                కౌసల్యకంటె నిన్ ఘనముగాఁ జూచు.
                నీసేవ లొనరించు నీపంపుచేయ;
                నెటువలె బొమ్మంటివే దయమాలి ?- అయోధ్యాకాండము

          ద్వి. వ్రతములఁ గడు డస్సి వనటలఁ గ్రుస్సి
                యతిదుఃఖములఁ గుంది యాత్మలోc గంది
                విపులాశ్రువులఁ దోగి విరహాగ్నిఁ గ్రాఁగి
                కపటవృత్తులఁ జిక్కి- కడముట్ట స్రుక్కి
                జీవంబుపై రోసి చెలువంబుఁ బాసి
                యా విధి మది దూఱి యలసత మీఱి
                చెక్కిటఁ జెయి చేర్చి చింతల కోర్చి
                దిక్కు లేమిఁ దలంచి ధృతి దూర డించి