246
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
మహీపాలనము చేసి పరలోకగతుఁడై న ప్రతాపరుద్రునికాలములో నుండి యాతనిచేత నగ్రహారములు మొదలైనవి బహుమతులుగాఁ బడసెనుగనుకను, తన కాలములోనే తన శిష్యపుత్రులు కూడ నుండవచ్చును గనుకను, సోమనాధుని మఱికొంతవెనుకకు జరపి 1180 వ సంవత్సర ప్రాంతములం దుండెనని నేను చెప్పుచున్నాను.
శ్లో.'గురులింగార్యస్య దయాహస్త గర్భసముద్భవః |
బసవేస్య తనయః బసవేశ్వర గోత్రకః ||
బసవేశ భుజిష్యాత్మభవో బసనకింకరః |
శ్రీమత్పాల్కుర్కిసోమేశనామాహం సర్వవిత్తమః||
పండితారాధ్యచరితాలంకృతాం కృషి మారధే|
తత శ్శ్రుణు నతామాత్యసూరనామాత్య శేఖర||
అని పండితారాధ్యచరిత్రమునందు సోమనాధుఁడు తన్నుఁ గూర్చి చెప్పుకొని యున్నాఁడు. దీనినిబట్టి సోమనాధుఁడు లింగార్యుని ఛాత్రుడయినట్టును; బసవేశునిపుత్రుఁడయినట్టును గనఁబడుచున్నాఁడు. మనలో గురువులును జనకులుగానే భావింపఁబడుదురు గనుక ననుభవసారమనం దా యర్ధముననే చెప్పఁబడెనేమో ! భారతమునందలి యీ పద్యార్థమును జూడుఁడు.
మధ్యాక్కర
"తనర జనకుండు నన్నప్రదాతయును భయత్రాత
యును ననఁగ నింతులకు మువ్వు రొగి నయిరి గురువు:
లనఘ ! యువనేత మఱియు నిరంతరాధ్యాపకుండు
ననఁగఁ బురుషున కియ్యేవు రనయంబు గుర వు లైరి."
కాcబట్టి యితనికాల మిప్పటి కేడువందల యిరువది సంవత్సరము లని చెప్పవచ్చును. ఈతడు వీరశైవుఁడు; శైవమతగ్రంధముల ననేకములను రచియించెను. ఈ సోమనాథకవి రచియించిన తెనుఁగు గ్రంథములలో ద్విపదరూపమున నున్న పండితారాధ్యచరితమును, బసవపురాణమును