230
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
మాత్రముచేత క్రొత్తకవి ప్రాఁతకవి కానేరcడు. ఈ కవి భావార్థకమునందు టకారము వాడె ననుట కొక్క యుదాహరణమును కుమార సంభవమునుండి చూపెదను -
క. దొనఁగోలఁ గోలవేగం
బున నరికొల్పుటయుఁ దిరుపుఁ బొరిఁ బౌరి విడుపుం
జనుటయు దనుజులఁ గొనుటయు
ననిమిషులకు నైనఁ గాంచు డరుదయ్యె ననిన్-[ఆ.12-153]
అరిగొల్పుట, చనుట, కొనుట, అని మొదట మూడుచోట్ల టకారమువేసిన వారు కడపట కూడ 'కాంచుట" యని టకారమును వేయక కాంచు డని డకార మేల వేయవలెనో దురూహ్యముగా నున్నది. కాంచు డరు దయ్యె ననుటకు మాటలుగా "కాంచు టరు దయ్యె" నన్నచో యతి భంగము వచ్చునా ? గణభంగము వచ్చునా ? ఏదియును రాదు. ఈ ప్రకారముగానే యేకాదశాశ్వాసములోని 53 వ దయిన యీ పద్యమునందును -
ఉ.[1] ఆయము లిచ్చు డాజిమొన కాయము వెంచుట పెక్కు మన్ననల్
వేయుట పోరికి న్మొనసి చేయుట గా మది నిశ్చయించుచున్
నాయకు కోర్కిcదీర్ప; ని నా యెడ్డ నూఱడినట్లు ఱొమ్మునం
జే యిడి నిద్ర వోయిరి నిశీథి భటులీ సమరంబు కోరుచున్.
పెంచుట, చేయుట, చేయుట, యని వరుసగా మూడుచోట్ల టకారమువేసి మొదట నొక్కచోటమాత్ర మిచ్చు డని డకార మేల వేయవలసివచ్చెను ? ఇచ్చుట యన్న ఛందోలకణభంగము లేమైన వచ్చునా ? ఇచ్చుట యన్నదే పూర్వకాలరూపముగాని యిచ్చు డన్నది కాదు. 'అంతకంతకు మా పట్టణములో త్రాగుడు హెచ్చుచున్నది' అను విధమున నిప్పుడిప్పుడు తాగుట యనుటకు త్రాగుడని వాడుకలోనికి వచ్చినది ఈ పుస్తకములో నిప్పు
- ↑ [ "ఆయములిచ్చుటాజి..... నిసిన్ సుభటుల్" అని విశ్వవిద్యాలయ ముద్రిత ప్రతి.]