పుట:Aandhrakavula-charitramu.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

231

న న్నె చో డ క వి

డున్నట్లు 'నాయెడ్డ' యని యుంచినచో గణభంగము కలుగుచున్నది. ఎఁడద, ఎద, ఎడ, ఎడ్డ, యని నాలుగు రూపము లుండఁగా నిర్బాధకమైన నడిమి రెండు రూపములలో నొకదా ని వేయక సబాధక మైన "యెడ్డ" యను రూపమును వేసి దాని క్రింద 'ఇందు డకారమును దేలఁ బలుకవలయును" అని టివ్పణమేల వ్రాయవాలెెెను ? "నాయెద నూఱడి" యని వేసిన నేమి దోషము ? ఇట్టి యసాధారణరూపములను వేసినంత మాత్రముచేత నిది యత్యంత పురాతన గ్రంథము కాగలుగునా? ఈ పుస్త కము యొక్క 10, 11 వ యా శ్వాసములలోనే యిటువంటి యెడ్డ లైదు గణభంగము కలుగునట్లుగా వేయఁబడి క్రిందను 'ఇందు డకారమును దేల నుచ్చరింపవలయు" లోనగు టిప్పణములు వ్రాయcబడినవి.

పయి పద్యమునందలి 'ఱొమ్మునం జేయిడి నిద్ర వోయిరి" యన్నభాగ మీ కవి నన్నయభట్టారకుని భారతమును చదివి యుండెనని తెలుపుడు చేయుచున్నది.

 
             క. "వినుతధనుర్విద్యావిదు
                 ఘనుఁ గర్ణు సహాయుఁ బడసి కౌరవవిభుఁ డ
                 ర్జునువలని భయము చెడి ఱొొ
                 మ్మునఁ జేయిడి నిద్ర వోయె ముదితాత్ముండై."


అను నాదిపర్వములోని పద్యమును జూడుఁడు నన్నెచోడుఁడు నన్నయభట్టు పుస్తకమును జదివె నని స్థిరపఱచుటకయి యిచ్చట మఱి రెండుదాహరణములను గూడ నిచ్చుట చాలి యుండవచ్చును.
నన్నయభ ట్టారణ్యపర్వమున ద్వితీయాశ్వాసమునందు :

             క. 'అఱపొఱడు కుఱుచచేతులు
                 నొఱవ శరీరంబు గలిగి యెురులకుఁ జూడం
                 గొఱగాకుం డియు మన్మధు
                 నొఱపులఁ బడియెడు నితండు యువతీ ప్రియుఁడై .[ప.134]